Telangana Schools Reopen: తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం, ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి ప్రత్యక్ష బోధన, తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను స్కూళ్లకు అనుమతి
Schools Reopen - Exams 2021 | Representational Image (Photo Credits: PTI)

Hyderabad, Feb 1: తెలంగాణలో దాదాపు పది నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష బోధన (Telangana Schools Reopen) ప్రారంభం కానుంది. వైద్య కళాశాలలు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు (Schools in Telangana) కూడా నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే, పిల్లలను బడికి పంపేందుకు తమకు అభ్యంతరం లేదన్న తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను అనుమతిస్తారు.

కాగా పాఠశాల తరగతి గదిలో విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం తప్పనిసరి. క్లాస్ రూములో 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్న భోజనం, టాయిలెట్లు, చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతాల్లో గుండ్రని గీతలు గీశారు. విద్యార్థులు వాటి ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్‌లోనూ ఓ ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు (Corona Virus) కనిపిస్తే ఆ గదికి పంపించి తల్లిదండ్రులకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందిస్తారు.

అవసరమైన విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. తెలంగాణలోని 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కూడా నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.65 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించేందుకు సుముఖత వ్యక్తంచేసినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

నేటి నుంచి ఏపీలో ప్రైమరీ స్కూళ్లు తిరిగి ప్రారంభం, జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ, కోవిడ్ నియమాలను ప్రకటించిన ఆరోగ్యశాఖ

కరోనా నేపథ్యంలో బడుల్లో ప్రార్థనలు, స్కూల్‌ అసెంబ్లీలు జరుపొద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల డీఈవోల సమావేశంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీచేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారు. విద్యార్థులు నేరుగా తరగతి గదికి వెళ్లాలని, అక్కడినుంచి ఇంటికే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా వెళ్లే క్రమంలో గుంపులుగా కాకుండా.. భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల్లో సమావేశాలు, వేడుకలు, రాజకీయ సభలను జరుపరాదని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని, దీన్ని పాటించాలని స్పష్టంచేశారు.

కాగా విద్యాసంస్థల్లో రెండు ఐసొలేషన్‌ గదులు ఏర్పాటుచేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు పాఠ్యపుస్తకాలు అందనివారికి పుస్తకాలు ఇవ్వనున్నారు. ప్రత్యక్ష తరగతులతోపాటే ఆన్‌లైన్‌ క్లాసులు సైతం కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ప్రత్యక్ష తరగతులు లేదంటే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావొచ్చని అధికారులు చెప్తున్నారు.

సోమవారం నుంచి 9, 10వ తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీలు తెరుచుకుంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతి గదికి 20 మంది విద్యార్థులే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తరగతి గదులు శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో పీజీ, డిగ్రీ కళాశాలలు, పెంట్లవెల్లి మండల కేంద్రంలో కస్తూర్బా, ఎమ్మార్సీ భవనాలను ఆమె ప్రారంభించారు. ౌపాఠశాలల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. 11,38,382 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు, మోడల్‌ స్కూళ్లకు హాజరయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. విద్యాసంస్థల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామని, ఉదాసీనంగా వ్యవహరించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరిన బీజేపీ నేతలు, వివాదాస్పదమైన ఎమ్మెల్యే అయోధ్య రామాలయం వ్యాఖ్యలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు సైతం సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. వైద్య కళాశాలలు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తుండటంతో షెడ్యూల్‌ ప్రకారం థియరీ క్లాసులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాక్టికల్‌, క్లినికల్‌ క్లాసులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్లినికల్‌ తరగతుల నిర్వహణలో భాగంగా వైద్య విద్యార్థులు పేషెంట్లను కలువాల్సి ఉంటుందని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాచ్‌లవారీగా విద్యార్థులను విభజించి అనుమతించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సోమవారం నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీలు తెరుచుకుంటాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతి గదికి 20 మంది విద్యార్థులే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాఠశాలలను సందర్శించి అవసరమైన చర్యలు చేపడుతారు. 11,38,382 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు, మోడల్‌ స్కూళ్లకు హాజరయ్యే అవకాశం ఉన్నది.