
Hyderabad, March 12: టీఎస్ ఎస్ఎస్‌సీ 2020 హాల్ టికెట్స్ (TS SSS 2020 Hall Ticket) విడుదలయ్యాయి. 10వ తరగతి వార్షిక బోర్డ్ పరీక్షలు (SSC Board Exams) రాయబోయే విద్యార్థులకు హాల్ టికెట్లను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బిఎస్ఇ) విడుదల చేసింది. పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను సెకండరీ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ అభ్యర్థులు, OSSC మరియు ఒకేషనల్ కోర్సుల ద్వారా పరీక్షలు రాసేవారికి కేటగిరీల వారీగా నాలుగు లింకుల్లో వేర్వేరుగా హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఆఫ్షన్స్ ఇవ్వబడ్డాయి. మీకు సరిపోయే లింక్ ను ఎంపిక చేసుకొని ఆ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. Click here for - Time Table
టీఎస్ ఎస్ఎస్‌సీ 2020 హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?!
- బిఎస్ఇ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఎడమ ప్యానెల్‌లో, ఎస్‌ఎస్‌సి 2020 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.
- రెగ్యులర్ విద్యార్థి లేదా ప్రైవేట్ అభ్యర్థి మీకు సంబంధించిన స్ట్రీమ్‌పై క్లిక్ చేయండి.
- మీ జిల్లాను ఎంచుకొని, అందులో మీ పాఠశాల పేరును ఎంచుకోవాలి, ఆ తర్వాత మీ పేరును ఎంచుకోవాలి.
- డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసిన తర్వాత డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
- స్క్రీన్ పై కనిపించే మీ హాల్ టికెట్‌ను ప్రింట్ ఔట్ తీసుకోండి
మార్చి 19, 2020 నుంచి ప్రారంభం అవుతున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 6, 2020 వరకు కొనసాగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయి మధ్యాహ్నం 12:45 లోపు ముగుస్తాయి. తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి బోర్డ్ పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు జరగనున్నాయి.