Representational Image | File Photo

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో (TS Inter First Year Result 2021) మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 56 శాతం ఉండగా.. బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబ‌ర్ 25, 2021 నుంచి న‌వంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. విద్యార్థులు ఫలితాల కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చు.

ప్రస్తుతం సెకండియ‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు జ‌న‌ర‌ల్ విద్యార్థులు 4,09,911 మంది, వొకేష‌న‌ల్ విద్యార్థులు 49,331 మంది హాజ‌ర‌య్యారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 4,59,242 మంది. కాగా జ‌న‌ర‌ల్ విద్యార్థులు 1,99,786 మంది, వొకేష‌న‌ల్ విద్యార్థులు 24,226 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు బోర్డు అధికారులు వెల్ల‌డించారు.

తెలంగాణలో ఇంటర్ స్పెషల్‌ ఎగ్జామ్స్‌ ఉండవు, వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌

ఏపీ లాసెట్‌ ఆడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ లాసెట్‌ 2021లో క్వాలిఫై అయిన విద్యార్థుల అడ్మిషన్స్‌ కోసం గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన AP LAWCET/APPG LAWCET లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు.