TS SSC Exams: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ
Representational Image (Photo Credits: PTI)

Hyd, April 8: తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం (time was extended to 30 minutes) పొడిగించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education Minister Sabita Indrareddy) తెలిపారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు (TS SSC Exams) హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నపత్రంలో అధిక చాయిస్‌ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రాత పరీక్షతోనే అభ్యర్థులను ఎంపిక చేసి నియామకాలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటర్వ్యూ(మౌఖిక పరీక్ష)లకు స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.ఇలా అయితే, ఉద్యోగ నియామకాల క్రతువు వేగంగా పూర్తి అవుతుందని, పొరపాట్లకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల, రెండేండ్ల బీఎడ్ కోర్సుకు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్‌–2, అంతకంటే తక్కువస్థాయి ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టింది. నూతన రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలతో నియామకాల ప్రక్రియ చేపట్టి నూతన ఒరవడిలో సాగవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

Telangana 10th Class Exam Schedule:

May 23- First Language Paper Group A … 9.30 am to 12.45 pm

May 23- First Language Paper 1 (Composite Course) .. 9.30 am to 12.45 pm

May 23- First Language Paper 2 (Composite Course) .. 9.30 am to 12.45 pm

May 24- Second Language .. 9.30 am to 12.45 pm

May 25- Third Language (English) .. 9.30 am to 12.45 pm

May 26- Mathematics‌ … 9.30am to 12.45pm

May 27- General Science Paper (Physical, Biological Science) .. 9.30 am to 12.45 pm

May 28- Social Studies … 9.30 am to 12.45 pm

May 30- OSSC Main Language Paper – 1 (Sanskrit, Arabic) .. 9.30 am to 12.45 pm

May 31- OSSC Main Language Paper – 2 (Sanskrit, Arabic) .. 9.30 am to 12.45 pm

June 1- SSC Vocational Course (Theory) .. will be held from 9.30 am to 11.30 pm.