Black Ink On Cheques (Credits: X)

Newdelhi, Jan 21: ‘కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్బీఐ (RBI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది’ అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో (Social Media) విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తను ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించినట్లు ఒక నకిలీ పోస్ట్ ను సర్క్యులేట్ చేయడంతో సామాన్య ప్రజానీకం కూడా ఇది నిజమేమోనని  భయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ న్యూస్ పెద్దయెత్తున చర్చకు దారితీసింది. చెక్కులపై నల్లటి సిరాను వాడటానికి పలువురు జంకుతున్నారు. ఈ క్రమంలో దీనిపై పీఐబీ ప్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు

పీఐబీ ఏమన్నదంటే?

బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు అనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దీనికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఆర్బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు