Heavy rain alert for Andhra Pradesh and Telangana(X)

Vijayawada, Nov 23: ఏపీలోని (AP) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వచ్చేవారం ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains in AP) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, నేడు ఇది ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనంగా అటు నుంచి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

తుఫానుగా మారే అవకాశం కూడా..

ప్రస్తుత అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.  మరోవైపు, ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)