MMTS(Photo-Twitter/South Central Railway)

Hyderabad, Feb 20: హైదరాబాద్‌లో (Hyderabad) మూడు రోజులపాటు 33 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు  దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే వీటిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్, రామచంద్రాపురం-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-రామచంద్రాపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్ రైలు సర్వీసులను నేటి నుంచి బుధవారం వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి అత్యాచారం.. మహిళా కమిషన్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం.. వీడియోతో

గురువారం నుంచి ఎంఎంటీఎస్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. దొరికిందే చాన్స్ అంటూ వండుకుని తినేసిన దుండగులు.. ప్రకాశం జిల్లాలో దారుణం