Representational Picture

Vijayawada, May 21: మండుటెండలు, వడగాలులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవ వచ్చని, పిడుగులు (Thunderstorm) పడే అవకాశం ఉందని పేర్కొంది. చెట్లకింద, ఆరుబయట ప్రదేశాల్లో ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.

Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

ఏయే జిల్లాల్లో వానలంటే?

నేడు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ సూచించారు.

Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్

మూడు రోజుల పాటు వర్షాలు

పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్ గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.