Trainman App New Feature

Vijayawada, Oct 8: విజయవాడ (Vijayawada) మీదుగా నడిచే పలు రైళ్లను (Trains) రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ (Traffic Block) దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా  రద్దు చేసింది.

Afghanistan Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌ లో గంట వ్యవధిలో ఆరు భూకంపాలు.. 320 మందికి పైగా దుర్మరణం, వెయ్యి మందికి పైగా గాయాలు.. డజనుకు పైగా గ్రామాలు నేలమట్టం.. పాపువా న్యూగినియా, మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాల అలజడి

రద్దు ఎప్పటి నుంచి?

  • విజయవాడ-తెనాలి (07279) రైలును రేపటి నుంచి 15వ తేదీ వరకు
  • తెనాలి-విజయవాడ (07575) రైలును రేపటి నుంచి 15వ తేదీ వరకు
  • బిట్రగుంట-విజయవాడ (07977/07978) రైలు 11వ తేదీ నుంచి 15 వరకు
  • బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237/17238)  రైలును రేపటి నుంచి 13వరకు
  • విజయవాడ- ఒంగోలు (07461) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు
  • ఒంగోలు- విజయవాడ (07576) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు
  • విజయవాడ- గూడూరు (17259/17260) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు
  • విజయవాడ- గూడూరు(07500) రైలును 11వ తేదీ నుంచి 15 వరకు
  • గూడూరు- విజయవాడ (07458) రైలును 12వ తేదీ నుంచి 16 వరకు
  • రాజమండ్రి- విశాఖపట్టణం (07466/07467) రైలును రేపటి నుంచి 15 వరకు
  • గుంటూరు- విశాఖపట్టణం (17239/17240) రైలును రేపటి నుంచి 16వరకు
  • విజయవాడ- విశాఖపట్టణం (22701/22702) రైలును 9,10,11,13,14 తేదీల్లో రద్దు
  • రాజమండ్రి- విజయవాడ (07767) రైలును 9వ తేదీ నుంచి 15 వరకు
  • విజయవాడ- రాజమండ్రి (07459) రైలును రేపటి నుంచి 15వరకు
  • మచిలీపట్టణం- విశాఖపట్నం (17219/17220) రైలును రేపటి నుంచి 16వరకు
  • విజయవాడ- గూడూరు (12743/12744) రైలును 11వ తేదీ నుంచి 16వరకు పూర్తిగా రద్దు

IVF Centre in Gandhi Hospital: సంతానం లేని దంపతులకు కేసీఆర్ సర్కారు గుడ్‌ న్యూస్‌.. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌

పాక్షికంగా రద్దు ఇలా..

పాక్షికంగా రద్దు అయిన రైళ్లలో.. నర్సాపూర్-గుంటూరు (17281/17282) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దు చేయగా, మచిలీపట్టణం-విజయవాడ(07896) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ- మచిలీపట్నం (07769), నర్సాపూర్- విజయవాడ(07883), విజయవాడ- మచిలీపట్టణం (07866), మచిలీపట్టణం-విజయవాడ(07770), విజయవాడ- భీమవరం జంక్షన్(07283), మచిలీపట్టణం-విజయవాడ (07870), విజయవాడ- నర్సాపూర్ (07861) రైళ్లు అవే తేదీల్లో అవే రూట్ల మధ్య రద్దు చేశారు. విజయవాడ, గుడివాడ-భీమవరం జంక్షన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లలో ధన్‌బాద్- అలెప్పి(13351) రైలును రేపటి నుంచి 13వరకు, హతీయ- బెంగళూరు(12835) రైలును ఎల్లుండి, టాటా- బెంగళూరు (12889) రైలును 13వతేదీ, టాటా- యశ్వంత్‌పూర్ (18111) 12వ తేదీన, హతియ- ఎర్నాకుళం (22837) రైలును 9వ తేదీన దారిమళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.