New Delhi,September 30: దాయాది బరితెగిస్తోంది. ఆర్టికల్ 30 రద్దు తర్వాత ఇండియాపై పగతో రగిలిపోతోంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అస్త్రంగా మలుచుకుంటోంది. ఇప్పటికే ఐరాస వేదికగా ఇండియా మీద నిప్పులు చిమ్మిన పాకిస్తాన్ కశ్మీర్ అంశంపై మరింతగా వివాదాన్ని రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌పై విషం కక్కిన మలేషియా, కశ్మీర్‌ను ఇండియా దండెత్తి ఆక్రమించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని విస్మరించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమ్మద్ ఖురేషీ (Pakistan Foreign minister Shah Mehmood Qureshi) ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రధానికి బదులుగా మాజీ ప్రధానికి ఆహ్వానం అందిస్తున్నట్లుగా తెలిపారు.
పాక్ విదేశాంగ మంత్రి వీడియో
Pakistan Foreign Minister Shah Mehmood Qureshi: We would like to extend an invitation to former Indian PM Manmohan Singh for the inauguration function of Kartarpur Corridor. He also represents the Sikh community. We will also send him a formal invitation. pic.twitter.com/ehcjBQxp8L
— ANI (@ANI) September 30, 2019
కాగా గురునానక్ దేవ్ సమాధి నెలకొన్న దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ భారత్, పాకిస్తాన్‌లు కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. ఈ కారిడార్ ద్వారా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ మసీదుతో పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ను అనుసంధానం చేస్తారు. రావి నదీ తీరంలో ఉన్న ప్రముఖ గురుద్వారాను సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సిక్కులు మత గురువు గురునానక్ తన జీవితంలో చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారు. ఇక్కడే తన చివరి శ్వాసను విడిచారు. అందుకే ఈ గురుద్వారం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రావి నదీ తీరంలోని కర్తార్‌పూర్‌కు భారత యాత్రికులు వీసా లేకుండా చేరుకునేందుకు అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా నవంబర్‌లో ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. ఎలాంటి 'అణు' సవాల్ నైనా భారత్ ఎదుర్కోగలదు
ఈ విషయంపై కాంగ్రెస్ నుంచి కాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి కాని ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అనధికార సమాచారం ప్రకారం మాజీ ప్రధాని దీనిని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఎఎన్ఐ రిపోర్ట్ చేసింది.
కాంగ్రెస్ వర్గాల సమాచారం
Congress Sources: Former Prime Minister Manmohan Singh will not accept Pakistan's invitation to the opening of #KartarpurCorridor (File pic) pic.twitter.com/ZYRodq5GPK
— ANI (@ANI) September 30, 2019
కాగా దేశ విభజనకు ముందు నుంచి కూడా పంజాబ్ ప్రాంతంలో ఈ గురుద్వారాకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే విభజన తర్వాత ఈ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో కలవడంతో ఇండియాలోని సిక్కులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కర్తార్‌పూర్ కారిడార్‌ను సంయుక్తంగా కలిసి నిర్ణయించాలని ఇరుదేశాలు ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్ సరిహద్దు నుంచి పాక్ వైపు భూభాగంలోకి రహదారిని నిర్మిస్తోంది. భారీ దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో భారత్‌పై విద్వేషం చిమ్ముతున్న పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. అవును..ఆల్-ఖైదాకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కర్తార్‌పూర్ కారిడార్‌పై ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత వివాదం రాజేస్తోంది.