Boycott Malaysia: భారత్‌పై విషం కక్కిన మలేషియా, కశ్మీర్‌ను ఇండియా దండెత్తి ఆక్రమించిందంటూ తీవ్ర వ్యాఖ్యలు, దాయాది దేశానికి వంత పాడిన మలేషియా ప్రధాని, ఐరాస వేదికగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు
Malaysian PM Raises Kashmir Issue (Photo-Twitter)

New York,September 30: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశం మీద కోపంతో రగిలిపోతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఐరాస వేదికగా ఇండియా మీద విషం చిమ్మిన సంగతి అందరికీ తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో యుద్ధం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి కశ్మీర్ లో ఉగ్రవాదులకు భారత ఆర్మీకి మధ్య యుద్ధం నడుస్తోంది. భారీ దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు..

ఈ వార్ ఇలా కొనసాగుతుంటే కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్‌‌కు మలేషియా తోడయింది. ఐరాస వేదికగా ఇండియా మీద విషాన్ని వెళ్లగక్కింది. జమ్మూ కశ్మీరును భారత్‌ ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ ఆరోపించారు. జమ్మూ కశ్మీరుపై సమితి తీర్మానానికి విరుద్ధంగా భారత్‌ వ్యవహరించిందన్నారు. ఇప్పటికే చైనా, టర్కీ మాత్రమే పాక్‌కు మద్దతుగా నిలవగా దానికి మలేషియా వంత పాడటంతో ఇప్పుడు మలేషియాపై ట్విట్టర్లో #BoycottMalaysia అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్లో ఇది ఇప్పుడు బాగా ట్రోల్ అవుతోంది.  ఎలాంటి 'అణు' సవాల్ నైనా భారత్ ఎదుర్కోగలదు

#BoycottMalaysia 

ఐరాసలో మాట్లాడుతూ స్వతంత్ర దేశమైన కశ్మీర్‌ను భారత్ దండెత్తి ఆక్రమించిందన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరించిందన్నారు. ఈ నెల 5న రష్యాలో మోడీతో భేటీలో కూడా కశ్మీరు అంశాన్ని ఆక్రమణ ద్వారా కంటే పాక్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించానని మీడియా సమావేశంలో తెలిపారు. కశ్మీరులో ఆర్టికల్‌ 370ను ఎందుకు నిర్వీర్యం చేసిందీ మోడీ చెప్పినప్పుడు తాను ఈ సలహా ఇచ్చానని చెప్పారు. భారత్ అలా చేయడానికి కారణాలు ఉండొచ్చు. కానీ భారత్ చేసింది మాత్రం తప్పేనని మహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని మలేసియా ప్రధాని సూచించారు. భారత్ తప్పనిసరిగా పాకిస్థాన్‌తో కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అవును..ఆల్-ఖైదాకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం! అంగీకరించిన పాక్ ప్రధాని

మలేషియా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

సెప్టెంబర్ 5న రష్యాలోని వ్లాదివోస్తోక్లో జరిగిన తూర్పు దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని మోడీతో మలేషియా ప్రధాని మహతిర్ మహమ్మద్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన జమ్మూకాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశాన్ని ఆక్రమణ ద్వారా కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వాలని లేదంటే అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. దీనిపై చర్చల ప్రసక్తే అవసరం లేదన్న మోడీ ఆయనకు చెప్పారు. అంతకు మించిన దాడులు చేస్తాం! బాలాకోట్ ఉగ్రశిబిరాన్ని మళ్ళీ ప్రారంభించిన పాకిస్థాన్

ఇదిలా ఉంటే మహతిర్ భారత్‌కి వ్యతిరేకంగా ఇదివరకు కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. మత ప్రబోధకుడు జకీర్ అప్పగింతకు ఇండియా తమపై ఏ ఒత్తిడీ తేలేదని, తనతో మోడీ భేటీ అయినప్పుడు జకీర్ అంశాన్ని ప్రస్తావించలేదని అన్నారు. ఈ కామెంట్లకు చెక్ పెడుతూ విదేశాంగ మంత్రి జయశంకర్ జకీర్‌ని ఇండియాకి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ట్విట్టర్లో ట్రోల్ అవుతున్న #BoycottMalaysia

ఇదిలా ఉంటే ఐరాస సర్వప్రతినిధి సభ సందర్భంగా పాకిస్థాన్, టర్కీ, మలేసియా దేశాలు త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడం కోసం, ఇస్లాం పట్ల ఉన్న అనుమానాలను తొలగించడం కోసం ఓ ఇంగ్లిష్ టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.