New Delhi, June 19: రాజ్యసభ ఎన్నికలకు (2020 Indian Rajya Sabha elections) సర్వం సిద్ధమైంది. 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, గుజరాత్‌లో నాలుగు, జార్ఖండ్‌లో 2, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్‌లో 3, మణిపూర్, మేఘాలయలో ఒక్కో సీటుకు ఎన్నికలు జరగున్నాయి. మొత్తం 19 సీట్లకు ఈ రోజు ఎన్నికలు (Rajya Sabha Election 2020) జరగనున్నాయి. ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్, తెలంగాణా నుంచి రెండు సీట్లు ఖాళీ, మార్చి 26న ఓటింగ్
ఇక మిగిలిన ఆరు సీట్లలో కర్ణాటకలో నాలుగు సీట్లు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, మిజోరాంలో మరో సీటు మిగిలి ఉన్నాయి. అరుణాచల్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ జూన్ 25న, మిజోరాం ఎంపీ జూలై 18న పదవీకాలం పూర్తి చేసుకోనున్నారు. కర్ణాటకలో నలుగురి పదవీకాలం జూన్ 25తో ముగుస్తుంది.
కాగా 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మాజీ ప్రధాని దేవెగౌడ తొలిసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు. 1996లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు పెద్దల సభకు నేరుగా ఎన్నికయ్యారు. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియా, మరో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, జార్ఖండ్ నుంచి శిబు సోరెన్ లాంటి పెద్ద లీడర్లు బరిలో ఉన్నారు. ఏపీలో ఫలించిన అంబానీ వ్యూహం
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగనున్నాయి. గుజరాత్‌లోని నాలుగు సీట్లకు బీజేపీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ ఇద్దరిని రేసులో ఉంచింది. మధ్యప్రదేశ్‌లోని మూడు సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన, సీనియర్ నేత కే.కేశవరావుకు మరోసారి ఛాన్స్, మరో స్థానానికి సురేశ్ రెడ్డిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ తప్పనిసరిగా మారింది. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభలోని అసెంబ్లీ కమిటీ హాలు–1లో పోలింగ్ జరగనుంది.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలను వెల్లడించనున్నారు. నాలుగు సీట్లకు గాను ఐదుగురు పోటీలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యాపారవేత్త, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి, మరో వ్యాపారవేత్త పరిమళ్ నత్వానీ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి దళిత నేత వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.