Lucknow,January 31: పుట్టిన రోజు వేడుకకు పిల్లల్ని పిలిచి వారిని బందీలుగా చేసిన ఓ పాత నేరస్తుడిని గురువారం అర్ధరాత్రి ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) (nsg commandos) చాకచక్యంగా మట్టుబెట్టింది. నేరస్తుడి చెర నుంచి 23 మంది పిల్లల్ని (23 Children Rescued) సురక్షితంగా రక్షించింది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫరూఖాబాద్ (Farrukhabad)జిల్లాలో ఓ దుండగుడి గురువారం సుమారు 20 మందికిపైగా చిన్నారులను బంధించాడు. తన కూతురి బర్త్‌డే పార్టీకి పిల్లల్ని ఆహ్వానించి.. వారిని బంధించాడు.
హెల్ప్‌లైన్ నెంబర్ 100కు డయల్ చేస్తే 3 నిమిషాల్లోనే సహాయం
వారందరినీ బయటకు వెళ్లకుండా తన ఇంట్లోనే బందీలుగా ఉంచుకున్నాడు. అప్రమత్తమైన అధికారులు, అతడిని ఒప్పించి, పిల్లలను కాపాడేందుకు స్థానిక పెద్దలను, కుటుంబసభ్యులు, బంధువులను రప్పించారు.
వైసీపీ నేత హత్యకు కుట్ర, శ్రీకాకుళం జిల్లాలో కలకలం
ఈ ఘటనలో యూపీ పోలీసులు పిల్లల్ని రక్షించేందుకు సుమారు 8 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. చివరకు పిల్లల్ని బంధించిన దుండగుడు సుభాష్ బాథమ్‌ను పోలీసులు కాల్చి చంపారు.ఆ కాల్పులు జరిగినప్పుడు సుభాష్ భార్య కూడా గాయపడింది.
Read the ANI Tweet Below
UP Additional Chief Secretary and Principal Secretary Home Awanish Kumar Awasthi on children kept as hostage at a house in Farrukhabad: The person who was holding the children as hostage has been killed in an operation and all children have been safely evacuated. pic.twitter.com/48QYcsoGRr
— ANI UP (@ANINewsUP) January 30, 2020
గురువారం రాత్రి కసరియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పిల్లలందరినీ పోలీసులు వారి వారి తల్లితండ్రులకు అప్పగించారు. ఆరు నెలల నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న సుమారు 23 మంది పిల్లలను సుభాష్ బర్త్‌డే పార్టీకి పిలిచారు.
ఇక నుంచి రైల్వేలో అన్నింటికి ఒకటే నెంబర్
సాయంత్రం ఆరు గంటల సమయంలో బర్త్‌డే పార్టీ కోసం సుభాష్ (Subhash Batham) ఇంటికి వెళ్లిన పిల్లలు ఆ ఇంట్లోనే బంధీ అయ్యారు. అయితే రాత్రి ఒంటి గంట వరకు పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. రాత్రి 1. 20నిమిషాల సమయంలో పిల్లల్ని సురక్షితంగా విడిపించారు.
రేప్ జరగలేదు కదా..జరిగాక రా..చూద్దాం
Here's the Tweet:
#UPDATE IG Kanpur Range Mohit Agarwal: The woman has succumbed to injuries, we are waiting for post mortem report, further details on cause of death will only come out after the report. #Farrukhabad https://t.co/Qd85Hg7AtM
— ANI UP (@ANINewsUP) January 31, 2020
ఇదిలా ఉంటే అక్రమంగా తనపై పోలీసులు హత్యకేసు మోపారంటూ ఆరోపించాడు. అతడి కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యేను కూడా తీసుకువచ్చారు. వారంతా నచ్చజెప్పేందుకు యత్నించగా లోపలి నుంచి ఆరు పర్యాయాలు కాల్పులు జరిపాడు. ఒక నాటుబాంబును కూడా బయట ఉన్న వారిపైకి విసిరాడు. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
ఆ నంబర్ పోలీసులది కాదు, ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు
Read the ANI Tweet Below
Farrukhabad Police: More than 15 children, and a few women, have been held hostage at a house by a man. Incident of firing has also taken place. Operation to rescue them is underway. Senior police officers are present at the spot. https://t.co/SFoEdEuq7g pic.twitter.com/PkPALZ4Z4Y
— ANI UP (@ANINewsUP) January 30, 2020
చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్‌ఎస్‌జీను రంగంలోకి దించింది. అతడిని పలుమార్లు లొంగిపొమ్మని చెప్పగా ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. దీంతో అతడిని ఎన్‌ఎస్‌జీ మట్టుబెట్టింది. సుభాష్ బథమ్‌కు మతిస్థిమితం లేదని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.