Srikakulam, December 03: శ్రీకాకుళం జిల్లాలో సుపారీ హత్య పన్నాగం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవిను హతమార్చేందుకు దుండగులు కుట్ర చేశారు. ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. పోలీసులు ఆ గ్యాంగును అరెస్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా) (Srikakulam వైసీపీ నేత మొదలవలస చిరంజీవిని(Modalavalasa chiranjeevi) హత్య చేసేందుకు ఓ సుపారీ గ్యాంగ్ (Supari Gang) యత్నించింది. హత్య చేయడానికి ముందు పలుమార్లు రెక్కి నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా పెట్టారు.చిరంజీవిని హత్య చేసేందుకు 10 లక్షల డీల్ (Rs. 10 Lack Deal) మాట్లాడుకున్న సుఫారీ గ్యాంగ్ ముందుగానే 4 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకుంది. కాగా ఈ హత్యలో రౌడీషీటర్ కన్నబాబుకు పలాస రౌడీషీటర్ పరమేష్ సహకారం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
చిరంజివి కదలికలపై రెక్కీ నిర్వహించి హత్యకు స్కెచ్ వేసుకుని సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. వారిని పసిగట్టిన పోలీసులు. . ఇద్దరు రౌడీషీటర్లు సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 కత్తులు, 70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ గ్యాంగ్ కు సుపారీ ఎవరు ఇచ్చారు? వాళ్లు ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? మొదలవలస చిరంజీవులకు ఎవరు శతృవులున్నారు? అది రాజకీయంగానా లేక వ్యక్తిగతంగానా? అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు.