 
                                                                 Vjy, Oct 23: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వినియోగదారులు నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.
ఈ సమావేశంలో ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఇక పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఏపీపీఎస్సీ ఛైర్మన్గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని మీటింగ్ లో నిర్ణయించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Here's Meeting Videos
దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం. ఉచిత సిలిండర్ల పథకానికి ఏటా రూ.2,700 కోట్ల వ్యయం. మహిళలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. #3FreeGasCylindersInAP#DeepamFromDeepavali #IdhiManchiPrabhutvam#AndhraPradesh pic.twitter.com/bXmF4Z9jaF
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలయ కమిటీల్లో సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. #IdhiManchiPrabhutvam#AndhraPradesh pic.twitter.com/00CCQO5XME
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
అలాగే విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో జగన్ ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది.దీంతో శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
