Vijayawada, Nov 4: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చే మరో అద్భుతం మరికొద్ది రోజుల్లో సాకారం కానున్నది. ఈ నెల 9న విజయవాడ-శ్రీశైలం (Sea Plane in AP) మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పున్నమిఘాట్ లో దీనిని ప్రారంభిస్తారు. విజయవాడ-శ్రీశైలం మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
విజయవాడ, శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ! #TrialRun #FirstEver #Seaplane #service #Punnami #Vijayawada https://t.co/gc4Ep2sKwb
— ETVBharat Andhra Pradesh (@ETVBharatAP) November 4, 2024
రెండో దశలో ఇలా..
14 సీట్లున్న ఈ సీప్లేన్ ను డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించింది. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీశైల మల్లన్న ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. రెండో దశలో విశాఖ, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.