Apex Council Meeting Highlights: ముగిసిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం, కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల తుది నిర్ణయం అపెక్స్‌ కౌన్సిల్‌దే, ప్రెస్ మీట్‌లో పలు కీలక అంశాలను వెల్లడించిన కేంద్రమంత్రి షెకావత్
Gajendra Singh Shekhawat (Photo Credits: PTI)

New Delhi, Oct 6: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం (TS-AP Water Sharing) కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం (Apex Council meeting) ముగిసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం జగన్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ (Gajendra Singh Shekhawat) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించామ‌ని తెలిపారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్ట్‌లు కట్టాలన్నా.. వాటికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌దేనని షెకావత్‌ స్పష్టం చేశారు.

మోడీ ప్రభుత్వం అకౌంట్లో రూ. 3 వేలు వేస్తోందా? ఈ వార్త అంతా అబద్దమని తెలిపిన పీఐబీ, తప్పుడు వార్తలు నమ్మవద్దని హితవు

కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లపై డీపీఆర్‌లను సమర్పించడానికి ఇరురాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారనిషెకావత్‌ వెల్లడించారు. కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డులకు ముందుగా డీపీఆర్‌లను సమర్పించిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు తేవాలని చర్చించామని ఆయన పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి (Telangana, AP Water Dispute) సంబంధించి సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగిందని, కృష్ణా రివర్‌ బోర్డ్‌ను హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించేందుకు ఇరురాష్ట్రాలు ఒప్పుకున్నాయని చెప్పారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పామని షెకావత్‌ తెలిపారు.

ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం సమావేశం, 17 అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపిన అధికార వర్గాలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం

 2014లో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు స‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అపెక్స్ కౌన్సిల్ ఏర్ప‌డింది. చ‌ట్టం ప్ర‌కారం కృష్ణా న‌దీ జ‌లాల బోర్డు ఏర్పాటైంద‌ని తెలిపారు. ఇవాళ ప్ర‌ధానంగా నాలుగు అంశాల‌పై చ‌ర్చించామ‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యున‌ల్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ట్రిబ్యున‌ల్ ద్వారా నీటి కేటాయింపులు జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఓ ప‌రిష్కారానికి వ‌చ్చామ‌న్నారు.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామ‌న్నారు. పోతిరెడ్డిపాడు, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసినట్లు తెలుస్తోంది. 2016లో మొద‌టి అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ రెండోసారి కౌన్సిల్ భేటీ (Second apex council meet) అయింది. ఏడాదికి ఒక‌సారైనా అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించాలి. ఆరేళ్లు గ‌డిచినా గోదావ‌రి బోర్డు ప‌రిధి నిర్ణ‌యం కాలేదు. నాగార్జున సాగ‌ర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌పై చ‌ట్ట ప్ర‌కార‌మే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం.. న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తన వాదన వినిపించినట్టు తెలిసింది. రాయలసీమ, ప్రకాశం దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం.. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను ఆయన అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది,