Arvind Kejriwal. (Photo Credits: IANS)

New Delhi, April 1: ఢిల్లీలో కరోనావైరస్ (COVID-19 in Delhi) జడలు విప్పింది. తాజాగా అక్కడ నిజాముద్దీన్ మర్కజ్ (Nizamuddin Markaz) విషాద ఘటన వెలుగులోకి రావడంతో యావత్ దేశం నివ్వెరపోయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కారు (Delhi Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ (Coronavirus) సోకిన వారికి వైద్య సహాయం చేస్తూ మరణించిన వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ దాతృత్వాన్ని ప్రకటించింది.

పాకిస్తాన్‌లో వివక్ష కుట్ర, సింధ్‌లో హిందువుల ఆకలి కేకలు

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా సోకిన వారికి వైద్య సహాయం అందిస్తూ మరణించిన వారికి కోటి రూపాయలను సాయంగా కేజ్రీవాల్ ప్రభుత్వం (CM Arvind Kejriwal) బుధవారం ప్రకటించింది.

వైద్యులతో పాటు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ జాబితా కిందికి వస్తారని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న భేదమేమీ లేదని, కరోనా సోకిన వారికి సేవ చేస్తూ పై రంగాల వారు ఎవరు మరణించినా వారికి ఈ సాయం లభిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 1637కు పెరగ్గా, ఢిల్లీలో రెండు మరణాలు, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా

కాగా ఢిల్లీ లోని మర్కజ్ మసీదులో గత నెల మొదట్లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమాలకు దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఇప్పటికే పలువురు కరోనా వైరస్ బారిన పడగా, మరికొందరికి ఆ వైరస్ లక్షణాలు ఉన్నాయి. పాజిటివ్ ఉన్న వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా, అనుమానితులను క్వారంటైన్ కు పంపారు.

Here's the CNN News18 tweet:

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో ఉన్న తబ్లిగ్ జమాత్ భవనం నుంచి 2,361 మందిని తరలించే కార్యక్రమం ఈరోజు తెల్లవారుజాముతో ముగిసింది. ఇందుకోసం 36 గంటల ఆపరేషన్ నిర్వహించారు. పలు శాఖల సిబ్బంది శ్రమించాల్సి వచ్చిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు.

ఏపీలో ‘ఢిల్లీ’ కరోనా కల్లోలం

వైద్య, పోలీస్, ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ), ఇతర శాఖల సహాయ సహకారాలతో గత 36 గంటల్లో విస్తృతమైన ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. ఆ భవనం నుంచి ఖాళీ చేయించిన వారిని తరలించే ప్రక్రియ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగిందని వివరించారు. 2361 మందిలో 617 మందిని హాస్పిటల్ కు పంపామని, మిగిలిన వారిని వేర్వేరు ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉంచామని సిసోడియా చెప్పారు. కాగా, మర్కజ్ భవన్ సహా దాని పరిసరాలను శానిటైజ్ చేసినట్టు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర్కజ్ నిజాముద్దీన్ సమీపంలోని వీధులను అధికారులు మూసివేశారు.