Benjamin Netanyahu, and Jair Bolsonaro Thanks PM Modi For Sending Chloroquine to their Countrys (Photo-Twitter)

New Delhi, April 10: మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌పై (Coronavirus) పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటున్న భారత్‌పై (India) ప్రశంసలు కురుస్తున్నాయి. కోవిడ్‌-19ను (COVID-19) కట్టడి చేసేందుకు కీలకంగా మారిన మలేరియా యాంటీ డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (hydroxychloroquine) వాడకం సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా (America) సహా ఇతర దేశాలు భారత్‌ సాయం కోరిన విషయం తెలిసిందే.

మీ బలమైన నాయకత్వం, మానవత్వానికి సహాయపడుతుంది

అత్యవసర మందులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి తమకు అండగా నిలవాలని ప్రపంచదేశాలు అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు మాత్రలను ఎగుమతి చేస్తామంటూ హమీ ఇచ్చింది. హమీలో భాగంగా ఇప్పటికే కొన్ని దేశాలకు ఎగుమతులను ప్రారంభించింది. ఇప్పటికే అమెరికాకు మాత్రలు సరఫరా చేసిన భారత్‌ బ్రెజిల్‌, ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని భరోసానిచ్చింది. ఈ క్రమంలో ఆయా దేశాధినేతలు భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

కోవిడ్-19 దెబ్బకు న్యూయార్క్ సిటీలో 7067 మంది మృతి

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ ట్వీట్లకు బదులిచ్చారు. కోవిడ్ 19 ప్రభావిత దేశాలకు భారత్ అండగా ఉంటుందని ఈ బంధం కలకాలం ఇలాగే కొనసాగుతుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Here's Tweets

 

 

దాదాపు 29 మిలియన్ల డోసుల డ్రగ్స్‌ ఎగుమతి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), కరోనాపై పోరులో సహకారం అందిస్తామన్నందుకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ( Jair Bolsonaro) ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) సైతం ఇదే బాటలో నడిచారు. దాదాపు ఐదు టన్నుల మెడిసన్‌ ఇజ్రాయెల్‌కు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై వార్

ఈ మేరకు.. ‘‘ ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్‌ పంపినందుకు నా స్నేహితుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఇజ్రాయెల్‌ పౌరులందరూ మీకు ధన్యవాదాలు చెబుతున్నారు’’ అని నెతన్యాహు గురువారం ట్వీట్‌ చేశారు. ఇందుకు స్పందించిన మోదీ.. ‘‘ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడుతాం. స్నేహితులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇజ్రాయెల్‌ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కోవిడ్ 19 ప్రభావిత దేశాలకు హైడ్రాక్సిక్లోరోక్విన్,పారాసిటమోల్‌ ఎగుమతి చేస్తామని తెలిపిన భారత్

కరోనా ధాటికి ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 86 మంది మృతి చెందగా... దాదాపు 10 వేల మంది దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తమకు మాస్కులు సరఫరా చేయాలని ప్రధాని మోదీకి మార్చి 13న విజ్ఞప్తి చేసిన నెతన్యాహు.. ఏప్రిల్‌ 3న క్లోరోక్విన్‌ సరఫరా చేయాల్సిందిగా అభ్యర్థించారు. ప్రధాని మోదీ ఇందుకు సానుకూలంగా స్పందించి ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు.