Black magic at Karnataka Milk Federation office in Bellary(X)

Delhi, Jan 22:  ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మల్టీ నేషనల్ కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు ఉద్యోగాల కోత మొదలు పెట్టగా లక్షలాది మంది ఉద్యోగాలను కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కంపెనీ ఉద్యోగం కొల్పోయిన వ్యక్తి చేసిన పనికి మీరంత షాక్‌కు గురవడం పక్కా.

బళ్లారిలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) పరిపాలనా కార్యాలయం ముందు చేతబడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక నల్ల బొమ్మ, మేకులు కొట్టిన పెద్ద గుమ్మడికాయ, కొబ్బరి, నిమ్మకాయలు, కుంకుమ మరియు ఎరుపు సింధూరం వంటి వింత వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు. కర్మ ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, పిల్లాడిని కొట్టబోయిన ఆటోడ్రైవర్, అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడిన ఆటో, తీవ్ర గాయాలతో.

అంతేగాదు ఓ చిన్న కలశం దానిచుట్టూ దారం చుట్టడం, కొబ్బరికాయకు తాయెత్తు సంచిని కట్టడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. అలాగే ప్రతి వస్తువపై కుంకుమ, గుమ్మడికాయ, నిమ్మకాయలలో గోర్లు ఉండటంతో అంతా ఆందోళన చెందారు.

Black Magic At  Karnataka Milk Federation Office

ఎవరు ఇలా చేశారు అన్న దానిపై సీసీటీవీని పరిశీలించగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. పైగా సెక్యూరిటీ గార్డులు ఉన్న ఎవరు చేశారో కనిపెట్టలేకపోయారు. KMF ప్రస్తుతం ఆర్థిక నష్టాలతో సతమతమవుతోంది. దీంతో 50 మంది ఉద్యోగులను తొలగించడానికి జాబితాను సిద్ధం చేయగా వారిలో ఎవరైనా ఈ పని చేసి ఉంటారని అంతా అనుమానిస్తున్నారు. మొత్తంగా కేఎంఎఫ్ కార్యాలయం ముందు జరిగిన ఈ చేతబడి సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.