కాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) చోటు చేసుకుంది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్‌లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్ లోడ్ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో సరస్సులో బోల్తా పడింది. కివూ సరస్సు (Kivu lake) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు (Rescue teams) కాపాడాయి.
నైజర్ నదిలో ఘోర పడవ ప్రమాదం, 100 మంది గల్లంతు, వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన
కాంగో ప్రభుత్వ బలగాలకు, M23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది.
Here's Video
Ooh my country, the DRC 🇨🇩😭!!! On calm waters, Sinking of a boat with passengers on board at Lake Kivu. The boat left Minova towards Kituku in Goma pic.twitter.com/wj3Jpjdsgv
— Aganze Rafiki (@AganzeRafiki) October 3, 2024