Hyd, Dec 11: సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. ఎస్సారెస్పీ ఫేస్ 1, ఫేస్ 2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు అన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం...రైతులకు యాసంగి పంట ముఖ్యమైందన్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేతిలో నిర్ణయం ఉందని ప్రభుత్వం అంటోంది...డ్యామ్ సేఫ్టీ చట్టంలో ఎక్కడా ప్రాజెక్టు రిపేర్లు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని లేదు అన్నారు. వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి... రైతుల యాసంగి పంటకు చివరి తడి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీ, జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మూడు రోజుల పర్యటన, ఈసారైనా నామినేటెడ్ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చేనా?
Here's Video:
మేడిగడ్డ బ్యారేజిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేతిలో నిర్ణయం ఉందని ప్రభుత్వం అంటోంది.
డ్యామ్ సేఫ్టీ చట్టంలో ఎక్కడా ప్రాజెక్టుకు రిపేర్లు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని లేదు.… pic.twitter.com/zsBLczZpe5
— B Vinod Kumar (@vinodboianpalli) December 11, 2024
మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీలపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది... నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందన్నారు. వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు, రిక్టర్ స్కేల్‌పై 5.3 భూకంపం వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు అన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు... కమీషన్లు ఏం చేస్తాయి.. కమీషన్లు అన్నం పెట్టవు అన్నారు. పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న తప్పులు జరగడం సహజం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండన్నారు.