New Delhi, Febuary 01: బడ్జెట్ సమయం ఆసన్నమైంది. అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బడ్జెట్ (Union Budget 2020) రెడీ అయింది. నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మరికొన్ని గంటల్లో ఆవిష్కరించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు (parliament) బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో (Budget 2020) ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి.
బడ్జెట్ అంటే ఏమిటి, తొలి బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెట్టారు
దాదాపు సభ్యులు అందరూ ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలను ఆదేశించాయి. శుక్రవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేను ప్రకటించిన సంగతి తెలిసిందే.
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ భారత్ లక్ష్యం
ఆదాయపు పన్ను పరిమితి పెంచుతారని, రైతుల కోసం ప్రత్యేక స్కీమ్స్ ఆవిష్కరణ, ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్‌టీ తగ్గింపు వంటి అంశాలను ఎక్కువ మంది ఆశిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ఆలోచన ఎలా ఉందో ఇంకొన్ని గంటల్లో అందరికీ తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఆర్థిక సర్వే 2020ను ఆవిష్కరించింది. దేశ ఆర్థిక స్థితిగతులను ఇది ప్రతిబింబించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ రేటు 6-6.5 శాతం మధ్యలో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా పెరగొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది.
బడ్జెట్ 2020లో రైతులకు మరో రెండు కీలక పథకాలు
మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. జీడీపీ రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్టానికి పెరిగిపోయింది. కంపెనీలు కూడా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుండటం గమనార్హం.