Central Government Conspiracy to Dominate Universities, slams cm Revanth Reddy(X)

Hyd, Jan 26:  UGC నిబంధనలు మార్చి విశ్వ విద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి... ఇది రాజ్యాంగం, రాష్ట్రాలపై దాడి చేయడమేనన్నారు.

ఇలాంటి చర్యలు మంచివి కావు, అనవసర వివాదాలకు దారి తీస్తాయి అన్నారు. UGC నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మా హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము అన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ సమాజం తప్పకుండా నాకు పదేళ్లు అవకాశం ఇస్తుంది... 1994 నుంచి 2024 వరకు పార్టీలకు పదేళ్ల చొప్పున అవకాశం వచ్చిందన్నారు. 2034 వరకు తెలంగాణలో అద్భుతాలు సృష్టించే వయసు, ఓపిక నాకు ఉన్నాయి అన్నారు. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదు అన్నారు.  అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో 

నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించాం అన్నారు.

 Central Government Conspiracy to Dominate Universities, slams cm Revanth Reddy

వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)కి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాం అన్నారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించాం అన్నారు.