Hyd, Nov 16: ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. హైదరాబాద్‌లో AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నారా రామ్మూర్తి నాయుడు. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యహ్నం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
హైదరాబాద్‌కు పయనమయ్యారు నారా లోకేష్. నారా కర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు. తెలుగుదేశం అధినేత, ఏపి సీఎం నారా చంద్రబాబు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు.. ఒకరు నటుడు నారా రోహిత్, మరొకరు నారా గిరీష్. జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రులే లేరని కామెంట్.. మంత్రులపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అన్న బాటలో టీడీపీలో చేరిన నారా రామ్మూర్తి నాయుడు.. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణ కుమారి చేతిలో ఓడి పోయారు. అనంతరం రామ్మూర్తి నాయుడు అనారోగ్య పరమైన కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకున్నారు. రామ్మూర్తి నాయుడు తనయుడు ప్రముఖ హీరో నారా రోహిత్. చాలా తెలుగు సినిమాల్లో హీరోగా నటించారు.