Amaravathi, December 10: ఏపీ అసెంబ్లీ రెండో రోజు శీతాకాల సమావేశాల్లో సన్నబియ్యంపై(Quality Rice) చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ (TDP vs YCP)సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సన్నబియ్యం విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట తప్పిందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (MLA Acchem Naidu) ప్రశ్నించారు. ముందు సన్న బియ్యం అన్నారు. ఇప్పుడు నాణ్యమైన బియ్యం అంటున్నారు..పాదయాత్ర సమయంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడేమో నాణ్యమైన బియ్యం అంటున్నారు.. ఎందుకీ యూటర్న్ అని నిలదీశారు. దీనికి ఏపీ సీఎం జగన్ ధీటుగా బదులిచ్చారు.
పాదయాత్రలో ప్రజల నుంచి ఎన్నో సూచనలు తీసుకున్నానని, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(AP CM YS Jagan) అన్నారు.'అప్పట్లో టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఆన్ లైన్ లో నుంచి తీసేసింది. మేమలా చేయట్లేదు. మా మేనిఫెస్టో అందరికీ అందుబాటులోనే ఉంది. ఈ మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత.. ఈ విషయాన్ని చెబుతూ మా మేనెఫెస్టోను ఎన్నికల ముందు విడుదల చేశాం' అని అన్నారు.
'ఇందులో ఉన్న ప్రతి అంశం మేము అమలు చేస్తామని ఓట్లు అడిగాం. ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఎక్కడా మేము బియ్యం గురించి పేర్కొనలేదు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నాం. కావాలంటే కళ్లద్దాలు సరి చేసుకొని చదువుకోండి.. ఎవరైనా చదువుకోవచ్చు' అని అన్నారు.
అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు, సభ్యుల గొంతు నొక్కితే ఊరుకోను
మొదట బియ్యం గురించి అవగాహన పెంచుకోండి. చంద్రబాబు పాలనలో ప్రజలకు నాణ్యమైన బియ్యం అందలేదు. మేము మాత్రం నాణ్యతతో కూడిన బియ్యాన్ని అందిస్తున్నాం. చంద్రబాబు పాలనలో ప్రజలు తినలేని నాసిరకపు బియ్యాన్ని అందించారు. నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని మేము శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టాం' అని జగన్ వ్యాఖ్యానించారు.
పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు, జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు
ఈ సందర్భంగా 2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం(Quality Rice Distribution) పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలు తినలేని బియ్యం ఇస్తే.. తమ ప్రభుత్వం మాత్రం నాణ్యమైన బియ్యం ఇస్తోందన్నారు.
సన్న బియ్యం అంటే ఏంటో తెలుసుకుంటే అచ్చెన్నకు నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. కొడాలినాని స్పందిస్తూ నాలెడ్జ్ అనేది బాడీ పెరిగితే రాదని బుర్రలో ఉంటుందని కౌంటర్ వేశారు. బుగ్గన స్పందిస్తూ గత అయిదేళ్ల నుంచి మేము వింటూనే ఉన్నామని నాలెడ్జ్ చాలా పెరిగిందని అచ్చెన్నాయుుడికి కౌంటర్ వేశారు.