Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, April 27: ఇండియాలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి (Deadly COVID-19 in India) కొనసాగుతూనే ఉంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా (Coronavirus) పాజిటివ్ కేసుల్లో భారత్ 28,000 మార్క్‌ను దాటింది. కొత్తగా 1463 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో సోమవారం సాయంత్రం వరకు మొత్తం కేసుల సంఖ్య 28,380కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 60 మంది మరణించారు. ఇప్పటి వరకు ఇంతలా మరణాలు చోటుచేసుకోవడం ఇదే అధికం. చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడవద్దు, వెంటనే చైనాకు వాటిని తిరిగి పంపండి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్

ప్రస్తుతం 21132 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 6362 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వల్ల నేటి వరకు 886 మంది (Covid 19 death) చనిపోయారు. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు, కలిసికట్టుగా కరోనాని తరిమేద్దాం, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుంది, ప్రెస్ మీట్లో ఏపీ సీఎం వైయస్ జగన్ వెల్లడి

దేశంలోని 85 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా 16 జిల్లాల్లో అయితే గత 28 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని తెలిపారు. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నప్పటికీ ఈ జిల్లాల్లో పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉందని, ఈ జిల్లాలు కరోనా ప్రభావానికి దూరంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Here's the list of states and their tally of coronavirus cases:

S. No. Name of State / UT Total Confirmed cases (Including 111 foreign Nationals) Cured/Discharged/Migrated Death
1 Andaman and Nicobar Islands 33 11 0
2 Andhra Pradesh 1177 235 31
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 36 27 1
5 Bihar 277 56 2
6 Chandigarh 30 17 0
7 Chhattisgarh 37 32 0
8 Delhi 2918 877 54
9 Goa 7 7 0
10 Gujarat 3301 313 151
11 Haryana 289 176 3
12 Himachal Pradesh 40 22 1
13 Jammu and Kashmir 523 137 6
14 Jharkhand 82 13 3
15 Karnataka 511 188 20
16 Kerala 469 342 4
17 Ladakh 20 14 0
18 Madhya Pradesh 2168 302 106
19 Maharashtra 8068 1188 342
20 Manipur 2 2 0
21 Meghalaya 12 0 1
22 Mizoram 1 0 0
23 Odisha 108 35 1
24 Puducherry 8 3 0
25 Punjab 313 71 18
26 Rajasthan 2185 518 41
27 Tamil Nadu 1885 1020 24
28 Telengana 1002 280 26
29 Tripura 2 2 0
30 Uttarakhand 51 33 0
31 Uttar Pradesh 1955 335 31
32 West Bengal 649 105 20
Total number of confirmed cases in India 28380* 6362 886
*220 cases are being assigned to states for contact tracing
*States wise distribution is subject to further verification and reconciliation
*Our figures are being reconciled with ICMR

తమిళనాడులో కొత్తగా 52 మందికి కరోనా ఉన్నట్లు తేలడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,937కు చేరింది. గడచిన 24 గంటల్లో 7,176 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. ఇవాళ ఒక్కరోజే 81 మంది కోలుకోగా సోమవారం సాయంత్రం వరకు 1,101మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా చెన్నైలోనే 500కు పైగా మంది కరోనా బారిన పడ్డారు. ఆర్బీఐ కీలక నిర్ణయం, మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, NBFCsలకు మారటోరియం విస్తరణపై బ్యాంకులదే తుది నిర్ణయం

మధ్యప్రదేశ్‌లో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 72 కొత్త కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,168కి పెరిగింది. వీరిలో 302 మంది కోలుకోగా, 106 మంది మృతి చెందారు. ఇండోర్‌లో అత్యధికంగా 915 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల జాబితాలో మధ్యప్రదేశ్ ఐదో స్థానంలోకి చేరింది.  లాక్‌డౌన్‌ కొనసాగించాలా, వద్దా అనేదానిపై మే 3 తర్వాత తుది నిర్ణయం, రాష్ట్రాల సీఎంలతో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

8,068 కేసులతో మహారాష్ట్ర జాబితాలో ముందుంది. ఇక్కడ ఇప్పటి వరకు 1,188 మంది కరోనా నుంచి బయటపడగా, 6,538 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 342 మంది మృతి చెందారు. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (3,301), ఢిల్లీ (2,918), రాజస్థాన్ (2,234) ఉన్నాయి. కరోనా సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్య, బెంగుళూరులో విషాద ఘటన, కర్ణాటకలో 500 దాటిన కరోనా కేసులు

ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు కరోనా వైరస్ నుంచి విముక్తి పొందినట్టు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర ప్రసాద్ తెలిపారు. కరోనా విముక్త రాష్ట్రాల్లో సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర ఉన్నాయి. ఈశాన్యంలోని అసోం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఇంకా కరోనా నుంచి విముక్తి పొందలేదు. అయితే, ఇటీవల కాలంలో ఆ మూడు రాష్ట్రాల నుంచి కొత్త కేసులేవీ నమోదు కాలేదు' అని మంత్రి తెలిపారు.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. వైరస్‌ పాజిటివ్‌ కేసులు 30 లక్షలకు చేరువకాగా 2 లక్షల 7వేల మంది మహమ్మారితో మృత్యువాతన పడ్డారు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 8.6 లక్షలకు పెరిగింది. ఇక అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 55,417కు చేరగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9.8 లక్షలకు ఎగబాకింది. బ్రిటన్‌లో ప్రాణాంతక వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 20,000 దాటింది.

అమెరికాలో వైరస్‌ బాధితుల సంఖ్య 10లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య 55వేలు దాటింది. రష్యాలో కొత్తగా 6,198 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 87,147కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 50 మంది కరోనా వల్ల చనిపోయారని రష్యా అధికారులు తెలిపారు.

స్పెయిన్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 23,251కి చేరింది. స్పెయిన్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల మార్కును దాటి 2,09,465కు చేరింది. వారిలో ల‌క్ష మందికిపైగా వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల నుంచి మ‌ర‌ణాలు, కోలుకున్నవారు పోగా.. ఇంకా 85,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటలీలో 195,351 కేసులు, ఫ్రాన్స్‌లో 161,665 కేసులు, జర్మనీలో 156,513 కేసులు నమోదయ్యాయి.