Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, May 24: భారత్‌లో గత 24 గంటల్లో 2, 22, 315 కొత్త కరోనా కేసులు (New COVID19 cases) నమోదు అయ్యాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొత్తగా రెండు లక్షల మందికిపైగా కరోనా (Coronavirus in India) బారిన పడగా, 4, 454 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశం మొత్తంగా 27,20,716 కొవిడ్‌-19 యాక్టివ్‌ కేసులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 3, 02, 524 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా ఏప్రిల్‌ 15 తర్వాత ఇప్పుడే తక్కువ కేసులు నమోదు అయ్యాయి.

88.30 శాతం రికవరీ రేటుతో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా మరణాలు అధికారికంగా మూడు లక్షలు దాటాయి. దీంతో ప్రపంచంలో కరోనా మరణాలు ఎక్కువ నమోదైన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో(1.13 శాతం) నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా తమిళనాడు 35 వేల కేసులు, మహారాష్ట్రలో 26 వేల కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక 25 వేల కేసులతో మూడో స్థానంలో నిలిచింది.

Here's ICMR Tweet

శనివారం దేశం మొత్తం19 లక్షల 28 వేల 127 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు(మొత్తం 33 కోట్లకు పైనే) ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌​ రీసెర్చ్‌ ప్రకటించింది. ఇప్పటిదాకా 19.60 కోట్లకుపైగా వ్యాక్సినేషన్స్‌ ప్రక్రియ పూర్తైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖా ప్రకటించుకుంది.

నేడు యాస్ తుఫానుగా మారనున్న వాయుగుండం, 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం, పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ, అప్రమత్తమైన పలు రాష్ట్రాలు

కరోనా రోగులపై బ్లాక్‌ఫంగస్‌, వైట్‌ఫంగస్‌ వ్యాధులు దాడి చేస్తుంటే ఇప్పుడు వీటికి గ్యాంగ్రీన్‌ జతవుతోంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో గ్యాంగ్రీన్‌ (gangrene) లక్షణాలు కనిపిస్తున్నాయంటుని వైద్యులు చెబుతున్నారు. పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత శరీరంలో వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనించాలని లేదంటే గ్యాంగ్రీన్‌, గుండెపోటు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా కోవిడ్‌ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు వారిన్ని వెన్నాడుతున్నాయి.

రెండు పద్ధతుల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు, పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపిన బోర్డు, పరీక్షలు నిర్వహణపై భేటీ అయిన కేంద్ర మంత్రుల కమిటీ

ఇందులో చాలా మందిలో రక్తం చిక్కబడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. అయితే చిక్కబడుతున్న రక్తాన్ని శరీరం తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. అయితే ఈ ప్రక్రియ పదేపదే జరగడం వల్ల కొందరిలో రక్తం గడ్డ కట్టుకుపోయి త్రోంబోసిస్‌కి దారి తీస్తోందంటుని డాక్టర్లు అంటున్నారు . అయితే ఈ రక్తపు గడ్డలు శరీరంలో ఎక్కడైతే రక్త ప్రసరణకు అతిగా అడ్డుపడతాయో క్రమంగా ఆ భాగంలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా గ్యాంగ్రీన్‌కు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు గుజరాత్‌లో వెలుగు చూస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

కాళ్లు , చేతుల్లో రక్తపు గడ్డలు ఏ‍ర్పడి మొద్దుబారిపోయి బరువుగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలంటున్నారు. లేదంటే కొద్ది రోజుల్లోనే ఆ గడ్డలు ఎరుపు లేదా నీలం రంగులోకి మారిపోతాయని చెబుతున్నారు. ఇక రక్తపు గడ్డలు గుండె లేదా మెదడులో ఏర్పడి రక్త ప్రసరణకు అడ్డుపడితే ఆరు గంటల్లోగా వైద్య సాయం అందించాల్సి ఉంటుందని లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు.