Coronavirus Outbreak in India. | Photo-PTI

New Delhi, Mar 18: విదేశాలకు వెళ్లిన ఇండియన్లపై కరోనా పంజా (Deadly Coronavirus) విసిరింది. మొత్తం 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ (COVDI-19) సోకినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఇరాన్ లో అత్యధికంగా 255 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకింది. వారంతా లద్దాక్ నుంచి ఇరాన్ పర్యటనకు వెళ్లి చిక్కుకుపోయారు.

ఇండియాలో కరోనా కల్లోలం, 147 కేసులు నమోదు, ముగ్గురు మృతి

వారి కోసం ఏడుగురు వైద్యులను కేంద్ర ఆఘమేఘాల మీద ఇరాన్ కు (Iran) పంపింది. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (Minister of State for External Affairs) మురళీధరన్ (Minister of State for External Affairs) ఈ విషయాన్ని చెప్పారు.

హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంకలో ఒక్కొక్కరికి చొప్పున కరోనా వైరస్ (Coronavirus) సోకినట్లు తెలుస్తోంది. ఇటలీలో ఐదుగురు ఎన్‌ఆర్ఐ‌లకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాగా ఇరాన్ లో కరోనావైరస్ కారణంగా కొత్తగా 113మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య అక్కడ 724 కు చేరింది.

అమెరికా, చైనాల మధ్య కరోనా వార్

యూఏఈలో 12 మంది భారతీయులకు, ఇటలీలో మరో ఐదుగురికి, హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంకలో ఒక్కొక్క కేసు నమోదు అయింది. మొత్తం విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కోవిడ్ 19 వైరస్ సోకింది.ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది.

Here's the ANI tweet:

చైనా, ఇరాన్, ఇటలీ, ఇండోనేషియా, ఆప్ఘనిస్తాన్, పిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి భారత్ కు రాకపోకలు నిషేధిస్తూ ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. అక్కడకు ప్రత్యే విమానాలు పంపించి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే వారిని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అసలైన సవాల్ ఇదే, సేఫ్‌హ్యాండ్స్ ఛాలెంజ్‌ని విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్ బారిన పడ్డట్లు ఉన్నవారికి కానీ లేక అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఆయా దేశాల్లోని ఎంబసీని ఆశ్రయించినట్లైతే అక్కడ వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత భారత్ కు రావాలనుకుంటే ఎయిరిండియా ద్వారా కానీ లేదా ఇతర విమానా సంస్థల ద్వారా ప్రత్యేకంగా వారిని తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 2 వేల మందిని వివిధ దేశాల నుంచి భారతదేశానికి కేంద్రం తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రకటించారు.

భారత సైన్యంలో తొలి కరోనావైరస్ కేసు నమోదు

భారత దేశంలో ఇప్పటి వరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం 147 మందికి వైరస్ సోకింది. వీరిలో ముగ్గురు చనిపోయారు. 14 మందిని డిశ్చార్జ్ చేశారు. 147 మందిలో కూడా 27 మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.