New Delhi, March 18: దేశంలో కరోనా (COVID-19) కేసుల సంఖ్య 147కు.. ఆ వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 3కు చేరింది. తెలంగాణలో ఐదో పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కరోనా భారీన పడిన వారిలో (COVID-19 Outbreak in India) 122 మంది భారతీయులు కాగా, 25 మంది విదేశీయులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ర్టలో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
భారత సైన్యంలో తొలి కరోనావైరస్ కేసు నమోదు
కరోనా (COVID-19 Outbreak in India) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు పలు రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటోంది. విదేశాల నుంచి ప్రయాణికులపై నిఘా పెట్టింది. అన్ని ఎయిర్‌పోర్టుల్లో (Airports) థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైళ్లలోనూ (Trains) ఈ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను పరీక్షిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు (Schools Holidays) సెలవులు ప్రకటించాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సినిమా హాల్స్, మాల్స్, పబ్బులు, క్లబ్బులను అన్నింటినీ మూసివేశారు.
Here's ANI Tweet
Ministry of Health and Family Welfare: Total number of confirmed #COVID19 cases in India rises to 147 - comprising 122 Indian nationals and 25 foreign nationals (as on 18.03.2020 at 09:00 AM) pic.twitter.com/Lzw64idp5F
— ANI (@ANI) March 18, 2020
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా మహారాష్ర్టలో (Maharashtra) 41 కేసులు నమోదు అయ్యాయి. ఇందుల్లో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. రెండో స్థానంలో కేరళ (Kerala) నిలిచింది. కేరళలో 27 కేసులు నమోదు కాగా, ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో (UP) 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 9, లఢక్ లో 8, తెలంగాణలో 3, జమ్మూకశ్మీర్ లో 3, రాజస్తాన్ లో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరాఖండ్, బెంగాల్, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది.
14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు
దేశంలోనే కరోనా సోకిన అతిపిన్న వయస్కురాలు.. మహారాష్ట్రకు చెందిన మూడేళ్ల చిన్నారి. తొలుత ఆ పాప తండ్రికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆయన నుంచి భార్యకు, ఆ చిన్నారికి కూడా వైరస్ సోకింది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. 15 రోజులపాటు ప్రజలంతా స్వీయ క్రమశిక్షణ పాటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రైవేటు కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల మూసివేతకు ఆదేశాలిచ్చారు.
కరోనాపై అవగాహన కల్పించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సూచించారు. కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రశంసించారు. మీడియాను కూడా అభినందించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహితంగా మెలిగిన 54 వేల మందిని గుర్తించామని.. వారిని పరిశీలనలో ఉంచామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో తెలిపారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా అన్ని చోట్లా కరోనా కట్టడికి కృషిచేస్తున్న వైద్యులను ఆయన కొనియాడారు.
కరోనా కట్టడిలో రాష్ట్రప్రభుత్వాలకు సహకరించేందుకు సంయుక్త కార్యదర్శి, ఆపై ర్యాంకుల అధికారులు 30 మందిని కేంద్రం నియోగించింది. ఆఫ్గనిస్థాన్, మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వచ్చేవారికి మనదేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ కరోనా పరీక్షలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది.