![](https://test1.latestly.com/wp-content/uploads/2020/04/Sarwar-Sharif-Dargah-Hazrat-Khwaja-380x214.jpg)
Ajmer, April 1: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (lockdown) ప్రకటించినా కొందరు మాకెందుకులే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కరోనావైరస్ ( Coronavirus) దేశ వ్యాప్తంగా పంజా విసురుతున్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసినప్పటికీ కొందరు మత సంబంధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్ధీన్ ఘటన మరచిపోకముందే మళ్లీ రాజస్థాన్ లో (Religious Congregation in Rajasthan) అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మత పెద్దల నిర్లక్ష్యమే కొంపముంచిందా..
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో (Ajmer) ఢిల్లీ లాంటిదే మరో ఘటన జరిగింది. సర్వార్ టౌన్‌లో ఉన్న ఓ దర్గాలో (Rajasthan dargah) మంగళవారం జరిగిన మత సంబంధ వేడుకకు 100 మందికిపైగా హాజరైనట్లు PTI వార్తా సంస్థ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, వారందర్నీ చెల్లాచెదురు చేశారు.
తబ్లిఘి జమాత్ యొక్క క్రియాశీల సభ్యుడు హైదరాబాద్‌లో మృతి
ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి మరీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకుగానూ ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.
ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, మర్కజ్ మౌలానాపై కేసు నమోదు
రాజస్థాన్ లో ఇప్పటిదాకా 93 కేసులు నమోదయ్యాయి రాజస్థాన్‌లోని భీల్‌వాడా నగరం అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ రాష్ట్రంలో నమోదైన 93 కరోనా కేసుల్లో 26కు పైగా భీల్‌వాడాలోనే బయటపడ్డాయి.
టూరిస్ట్ వీసాతో వచ్చి మతపరమైన ప్రచారం నిర్వహించిన విదేశీయులు
ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో (Nizamuddin Crisis) ఇటీవలే కొంతమంది ముస్లింలు ఓ మత సంబంధ కార్యక్రమం నిర్వహించన సంగతి విదితమే. దీనికి హాజరైన పలు రాష్ట్రాల్లోని వారు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ ఘటన గురించి మర్చిపోక ముందే మళ్లీ ఇలాంటివి జరగడంతో ఏం జరుగుతుందోనని టెన్సన్ మొదలైంది.