Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, June 12: కోవిడ్-19 కట్టడి చర్యలపై ఢిల్లీ సర్కార్‌ తీరును దేశ అత్యున్నత న్యాయస్ధానం (Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 రోగులను (COVID-19 Patients Treatment) పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు మండిపడింది. కరోనా రోగులకు సరైన చికిత్స ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్య తగ్గించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని ఆదేశించింది. ముద్దులతో 24 మందికి కరోనా అంటించాడు, ముద్దుపెట్టి కోవిడ్-19 నయం చేస్తానని చెప్పిన బాబా కరోనాతో మృతి, బాధితులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అధికారులు

దీంతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి (2020 Coronavirus Pandemic in India) చర్యల్లో వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి బారినపడి మరణించిన వారి మృతదేహాల నిర్వహణ అమానుషంగా ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణను జూన్‌ 17కు వాయిదా వేసింది. కరోనా కేసుల్లో బ్రిటన్‌ను దాటి 4వ స్థానానికి వచ్చిన భారత్, గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10956 కేసులు నమోదు, మొత్తం 8,498 మంది మృతి

దేశ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు, క‌రోనా మృత‌దేహాల ప‌ట్ల ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రులు హీనంగా (treated worse than animals) వ్యవహరిస్తున్నాయని, మృ‌తదేహాల‌కు క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంది. క‌రోనా పేషెంట్లు చ‌నిపోతే క‌నీసం వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా స‌మాచార‌మివ్వడం లేద‌ని ఆగ్ర‌హించింది. వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వ్య‌క్తి మృ‌తదేహం చెత్త‌కుప్ప‌లో వెలుగు చూసిన ఘ‌ట‌నపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. శుక్ర‌వారం భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం కోవిడ్ పేషెంట్ల‌పై ఆసుప‌త్రులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, అంత్య‌క్రియ నిర్వ‌హ‌ణ‌పై విచార‌ణ చేప‌ట్టింది.

వైరల్‌ అయిన వీడియో వాస్తవం కాదు: పశ్చిమ బెంగాల్‌ వైద్యారోగ్య శాఖ అధికారులు

ఇదిలా ఉంటే శ్మశాన వాటిక నుంచి కోవిడ్ 19 బాధితుల కుళ్లిన మృతదేహాలను వ్యాన్‌లో తరలిస్తున్నట్లు వైరల్‌ అయిన వీడియో వాస్తవం కాదని పశ్చిమ బెంగాల్‌ వైద్యారోగ్య శాఖ అధికారులు కొట్టిపారేశారు. అవి కరోనాతో మరణించిన వారి మృతదేహలు కావని మోర్గ్‌ ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలని పేర్కొన్నారు. గత 15 రోజులుగా వారికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో వాటిని ఖననం చేసేందుకు వ్యాన్‌లో తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోల్‌కత్తా పోలీసులు ట్వీట్‌ చేశారు.

Here's Kolkata Police Tweet

Here's Governor West Bengal Jagdeep Dhankhar Tweet

కాగా పశ్చిమ బెంగాల్‌లో దహన సంస్కారాల కోసం మున్సిపల్‌ సిబ్బంది కోవిడ్‌-19 మృతదేహలను వ్యాన్‌లో ఎక్కిస్తున్న వీడియో బుధవారం నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో గారియ శ్మశాన వాటిక వద్ద మున్సిపల్‌ సిబ్బంది తరలిస్తున్న14 మృతదేహలు కరోనా బాధితులవన్న కారణంగా గరియా ప్రాంత స్థానికులు నిరసనలు చేపట్టారు. అన్ని మృతదేహాలను ఒకేచోట దహనం చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలోని శ్మశానవాటికలో కరోనా బాధితుల మృతదేహాలు దహనం చేయడం వల్ల స్థానికంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చేపట్టారు. దీంతో ఆ మృతదేహాలను తిరిగి వ్యానులోకి చేర్చి అక్కడ నుంచి మరో శ్మశానవాటికకు తీసుకెళ్లారు.

Here's Governor West Bengal Jagdeep Dhankhar Tweet

ఇదిలావుండగా ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ జగదీప్ ధంఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని కోరారు. ‘మృతదేహాల పట్ల మున్సిపల్‌ సిబ్బంది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. మన సమాజంలో మృతదేహాలకు అత్యంత గౌరవం ఉంటుంది. అంతిమ సంస్కారాలు సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వండి ’.అంటూ ట్విటర్‌లో గవర్నర్‌ పేర్కొన్నారు.