New Delhi,January 19: నిర్భయ ఘటన (Nirbhaya Rape Case) జరిగిన నాలుగు నెలల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) మరో దారుణమైన ఘటన చోటు చేసుకున్నదనే విషయం చాలామందికి తెలియదు. ఐదేళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు(POCSO court) శనివారం దోషులుగా నిర్ధారించింది.
ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. మన సమాజంలో మైనర్ బాలికలను(Minor Girls) దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది.
ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి
2012 డిసెంబర్‌లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్(convicted Manoj Shah,Pradeep Kumar) బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని అక్కడే వదిలేసి వెళ్లారు.
దోషులను క్షమించి వదిలేయమంటున్న న్యాయవాది ఇందిరా సింగ్, భగ్గుమన్న నిర్భయ తల్లి
40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను పోలీసులు రక్షించారు. ఢిల్లీ పోలీసులు బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఓ నిందితుడిని, దర్బాంగాలో మరో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు.
ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి (Additional Sessions Judge)నరేశ్‌కుమార్ మల్హోత్రా(Naresh Kumar Malhotra) ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు.దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.