Coronavirus in Dharavi: ముంబై మురికివాడలో కరోనా ఘోష, ధారావిలో 47కు చేరిన కోవిడ్-19 కేసులు, ఐదుకి చేరిన మృతుల సంఖ్య, మహారాష్ట్రలో 1985కి చేరిన కరోనా కేసులు
Dharavi slums in Mumbai. (Photo Credit: PTI)

Mumbai, April 13: ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ (Asia's largest slum) అయిన ధారావి (Dharavi) ఇప్పుడు దేశ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తోంది. అక్కడ రోజు రొజుకు కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నాలుగు కేసులు నమోదు కావడంతో ఇప్పుడు అక్కడ కోవిడ్ 19 (COVID-19 Cases) కేసుల సంఖ్య 47 కి పెరిగింది. ఘోరమైన కరోనావైరస్ (Coronavirus Pandemic) కారణంగా ఈ రోజు ఒక వ్యక్తి కూడా మరణించాడు. తద్వారా ఈ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య ఐదుకి చేరుకుంది.

భారతదేశంలో 9,152కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారిలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,985 కు పెరిగిందని, మరణాల సంఖ్య 149 కు పెరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ తెలిపింది.

ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం అధిక చర్యలు తీసుకుంటోంది. 2.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ధారావిలో దాదాపు 15 లక్షల మంది నివసిస్తున్నారు. వీరంతా చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు. దేశంలోనే అత్యంత రద్ధీ ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటిగా నిలిచింది.

పోలీసులపై దాడి, ఏఎస్ఐ చేయిని తిరిగి అతికించిన వైద్యులు, నిహంగ్ వర్గీయులు 9 మంది అరెస్ట్

శానిటైజేషన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అగ్నిమాపక దళాలు శుక్రవారం మరుగుదొడ్లను శుభ్రపరిచాయి. ధారావిలో, ఒక టాయిలెట్ రూంను రోజుకు 100-200 మంది ఉపయోగిస్తున్నారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, ఈ ప్రాంతాన్ని శుభ్రపరచడానికి, డ్రోన్లను కూడా ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.

కాగా గత 24 గంటల్లో 796 కొత్త కేసులు, 35 మరణాలు సంభవించడంతో భారతదేశంలో సోమవారం కరోనావైరస్ సంఖ్య 9,152కు చేరింది. COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 308 కు చేరుకుంది, గత 24 గంటల్లో 35 మంది మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం. మొత్తం లెక్కల్లో, 7,987 క్రియాశీల కేసులు కాగా, 856 మంది వ్యక్తులు రికవరీ అయి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరణించిన వారి సంఖ్య 308 కు చేరుకున్నాయి.