Union FM Nirmala Sitharaman. (Photo Credit: PTI)

New Delhi, May 13: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు .ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలూ కుదేలైన నేపథ్యంలో ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ (Rs 20 Lakh Crore Economic Package) ప్రకటించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యమేర్పడింది.  రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

కరోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని (COVID-19 Relief Package) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీలో ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు దక్కాయో తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్యాకేజీ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ANI Tweet:

ప్యాకేజీలో ఇప్పటికే ఉన్న కొన్ని భూమి, కార్మిక చట్టాలలో సంస్కరణలు ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను జంప్‌స్టార్ట్ చేయడానికి అవసరమైన అదనపు లిక్విడిటీ మద్దతు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.  లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

‘‘ఇది కేవలం ఆర్థిక ప్యాకేజీయే కాదు. సంస్కరణ ఉద్దీపన కూడా. భారత ఆర్థిక వ్యవస్థ వివిధ రూపాల్లో, వివిధ కోణాల్లో సమగ్రంగా బలాన్ని పొందింది. ఇప్పుడు ప్రపంచంతో సులువుగా నడవొచ్చు. పెరుగుతున్న మార్పులను మాత్రమే దృష్టిలో పెట్టుకోలేదు. ఆమూలాగ్రంగా పరివర్తనను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్లిష్ట పరిస్థితిని ఓ అవకాశంగా మార్చుకుంటాం. ఆత్మ నిర్భర భారత్ ఒకేచోట ఏకీకృతం కాకుండా మరింత విస్తరిస్తుంది’’ అని నిర్మలా రామన్ ట్వీట్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి, 21వ శతాబ్దం భారత్‌దేనని తెలిపిన ప్రధాని మోదీ

లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వివిధ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌' పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మంగళవారం రాత్రి టీవీలో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని (PM Narendra Modi's Address to Nation), దేశ స్వయం ప్రకాశమే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ఉంటుందని పేర్కొన్నారు. దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ 10శాతమని వివరించారు. ప్యాకేజీ పూర్తివివరాలను ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ బుధవారం నుంచి దశలవారీగా ప్రకటిస్తారని తెలిపారు.