File image of CM Arvind Kejriwal and LG Anil Baijal (Photo Credits: PTI)

New Delhi, April 28: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఎన్నికైన ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్-జి) కు ప్రాధాన్యతనిచ్చే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వం (సవరణ) చట్టం 2021 (Government of National Capital Territory of Delhi (Amendment) Act, 2021) నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నరే ‘ప్రభుత్వం’ ( 'Govt in Delhi Now Means Lt Governor') అవుతారు.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ‘‘దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ప్రభుత్వ సవరణ చట్టం, 2021లోని సెక్షన్ 1లోని సబ్ సెక్షన్ (2) ద్వారా లభించిన అధికారాలను వినియోగిస్తూ, ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా 2021 ఏప్రిల్ 27ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs (MHA)) నోటిఫికేషన్‌ పేర్కొంది.

కాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, శాసన సభల నుంచి కార్యనిర్వాహక అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు (LG Anil Baijal)కట్టబెడుతూ ఈ చట్టాన్ని పార్లమెంటు గత నెలలో ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ చట్టం అమల్లోకి రావడంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై కార్యనిర్వాహక చర్యలను చేపట్టడానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాన్ని తీసుకోవలసి ఉంటుందని ప్రతిపక్షాలు మోదీ సర్కారుపై ఫైర్ అయ్యాయి. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిని "భారత ప్రజాస్వామ్యానికి విచారకరమైన రోజు" అని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలు సంబరాలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవు, ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన ఈసీ, కోవిడ్ కల్లోలం నేపథ్యంలో కీలక నిర్ణయం

ఈ కొత్త చట్టం (Government of NCT of Delhi (Amendment) Bill, 2021) ప్రకారం ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం తనంతట తానుగా ఏదైనా నిబంధనను రూపొందించి, అమలు చేయడానికి వీలుండదు. రోజువారీ కార్యకలాపాలను పరిశీలించేందుకు కమిటీలను ఏర్పాటు చేయడానికి, పరిపాలనాపరమైన నిర్ణయాలపై విచారణ జరపడానికి కూడా అవకాశం ఉండదు. భారత పార్లమెంటులో కార్యకలాపాల తీరుకు, విధానపరమైన నిబంధనలకు పొసగని రీతిలో కార్యకలాపాల నిర్వహణ, విధానాలను క్రమబద్ధీకరించేందుకు నిబంధనలను ఢిల్లీ శాసన సభ రూపొందించరాదని ఈ చట్టం చెప్తోంది.

దేశంలో కోవిడ్ సంక్షోభం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని తెలిపిన అత్యున్నత ధర్మాసనం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు

ఇదిలావుండగా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ చట్టంపై ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా, కొందరు సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదని ఆరోపించారు. కాగా నేటి నుంచి ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఈ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ‘ప్రభుత్వం’ అవుతారు. 2021 ఏప్రిల్ 27 నుంచి ఈ కొత్త చట్టం ఢిల్లీలో అమల్లోకి వస్తుందని MHA అదనపు కార్యదర్శి గోవింద్ మోహన్ సంతకంతో నోటిఫికేషన్ జారీ అయింది.