New Delhi,January 28: తమ వేతనాలను సవరించాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు ( Bank Employees) సమ్మెకు దిగుతుండటంతో రెండు రోజుల పాటు బ్యాంకులు (Bank Strike) మూతపడనున్నాయి. వేతనాల పెంపుపై ప్రధాన కార్మిక కమిషనర్‌తో తాజాగా ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన సమ్మె చేస్తున్నట్లు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. కాగా తమ వేతనాలను 20% పెంచాలని బ్యాంకు ఉద్యోగులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తమ పే స్లిప్పులో 20 శాతం వేతన సవరణ చేయాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
9 బ్యాంక్ యూని యన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ ఐక్య వేదికలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్ కార్మి కుల జాతీయ సంఘం (ఎన్‌ఓబీడబ్ల్యూ) వంటివి ఉన్నాయి. సమస్యల పరిష్కార దిశలో చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని, దీనితో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కు తీసుకోలేదని ఏఐబీఓసీ ప్రెసిడెండ్ సునిల్ కుమార్ తెలిపారు.
ఏదైనా బ్యాంకుపై లేదా ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా?
తమ వేతన సవరణ 2017 నుంచి చేయడం లేదని పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. వేతన సవరనపై (Over Wage Revision) స్పష్టమైన హామీనిచ్చేవరకు స్ట్రైక్ కొనసాగుతోందని స్పష్టంచేశారు. తాము సమ్మెకు వెళ్లడం తప్ప మరో మార్గం లేకపోయిందని, సమ్మె వల్ల వినియోగదారుల సేవలకు అంతరాయం కలిగించినందుకు మన్నించాలని ఐబీఏ యూనియన్ తెలిపింది.
బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా నిరసన
బ్యాంకింగ్ సమ్మె నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ పెన్షనర్లు అండ్ రిటైరీస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) ఐదవ ద్వైవార్షిక సమావేశం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. తమ సమస్యల పరిష్కారానికి, తగిన గౌరవప్రదమైన పెన్షన్ పొందడానికి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.
మరోసారి దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్న బ్యాంక్ ఉద్యోగులు
ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు సేవలు అందుబాటులో ఉండబోవని సమాచారం అందించాయి. అయితే బడ్జెట్‌కు (Budget session) కొద్దిరోజుల ముందు బ్యాంక్ యూనియన్లు సమ్మెకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రూ.110 కోట్ల ఫ్రాడ్ కేసులో అరెస్టయిన మారుతి మాజీ మేనేజింగ్ డైరక్టర్
చివరిసారి బ్యాంకు ఉద్యోగులకు యాజమాన్యం 2012 నవంబర్ 1వ తేదీన వేతన సవరణ చేపట్టారు. 2017 అక్టోబర్ 13వ తేదీ వరకు 15 శాతం హైక్ వేశారు. ఇక అప్పటినుంచి వేతన సవరణ చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కార్మిక సంఘాలు జనవరి 8వ తేదీన సమ్మె చేసిన సంగతి తెలిసిందే.