MLC Election Results: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం
రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Election Results) ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు (MLC Election Result 2021) ఏర్పాట్లు చేశారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో లెక్కిస్తున్నారు.
Hyderabad, Mar 17: రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Election Results) ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు (MLC Election Result 2021) ఏర్పాట్లు చేశారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో లెక్కిస్తున్నారు.
కాగా ఫలితాలపై స్పష్టత బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. లెక్కింపునకు మొత్తం 8 హాళ్లు వినియోగించనున్నారు. ఓక్కో మాల్‌లో 7 టేటుల్స్ చొప్పున 56 టేబుళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో 3,57,354 ఓట్లు పోలయ్యాయి. మూడు షిఫ్టుల్లో అధికారులు, సిబ్బంది పనిచేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు జిల్లాలకు సంబంధించి జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకి మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలోను, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలోను లెక్కించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 13575 ఓట్లకు గాను 12554 ఓట్లు పోలయ్యాయి. 92.95 శాతం పోలింగ్ జరిగింది.
తెలంగాణలో నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. ‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్‌ఎస్), ఎన్. రామచందర్‌రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది.
కౌంటింగ్ కోసం ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.
ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు.
(The above story first appeared on LatestLY on Mar 17, 2021 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

