Hyd, Nov 1: హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం .. సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు కమ్ముకొని వాన కురుస్తోంది.బాచుపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్,మోతీనగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, కవాడిగూడ, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బేగంపేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట్ల వర్షం నీరు నిలిచింది. పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
తెలంగాణలో దారుణం, 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు మైనర్లు అత్యాచారం, నిందితులు అరెస్ట్
తెలంగాణలో రాగల మూడు రో జులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 30న ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువ నగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కా జగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే, అక్టోబర్ 31, నవంబర్ 1 శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశాలున్నాయని వివరించింది.