Hyundai India:పాక్ నుంచి కాశ్మీర్‌పై హుండాయ్ వివాదాస్పద ట్వీట్, వెంటనే వివరణ ఇచ్చిన హుండాయ్ ఇండియా, ట్విట్టర్లో వైరల్ అవుతున్న #BoycottHundai హ్యాష్‌ట్యాగ్
Hyundai Motor Group

New Delhi, February 8: ప్రముఖ కార్ల కంపెనీ ‘హుండాయ్’ కాశ్మీర్ అంశం మీద పెట్టిన ట్వీట్ పై సోషల్ మీడియలో వార్ నడుస్తోంది. ఇప్పుడు ట్విట్టర్లో #BoycottHundai అనే పదం ట్రెండింగ్ గా మారింది.ఇండియాలో ‘హుండాయ్’ కార్లను ఎవరూ కొనుగోలు చేయొద్దని పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ వేదికగా హుండాయ్ అఫిషియల్ పేజీ నుంచి కాశ్మీర్ స్వాతంత్రానికి మద్దతు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

ఇండియాలో ఈ ట్వీట్లు వివాదంగా మారాయి. దీనిపై స్పందించి ఇండియాకు చెందిన హుండాయ్ (Hyundai India) భారతీయుల మనోభావాలను గౌరవిస్తామని, ఎవరో పెట్టిన పోస్టుకు తాము బాధ్యులం కాదని వివరణ ఇచ్చింది.

కాగా ‘హుండాయ్’ కంపెనీకి చెందిన యూనిట్లు పాకిస్తాన్లోనూ ఉన్నాయి. పాక్ యూనిట్ల పేరు మీద ఈనెల 5న ట్విట్టర్లో కొందరు పోస్టులు (Backlash on Pakistan Distributor's Kashmir Tweet) పెట్టారు. ఇందులో కాశ్మీర్ స్వాతంత్రానికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే పోస్టులు వైరల్ కావడంతో ఇండియాకు పాకింది. దీంతో ఈ పోస్టులు పెట్టిన హుండాయ్ కార్లను బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్విట్టర్లో ‘కియా మోటార్స్ క్రాస్ రోడ్స్ -హైదరాబాద్’ అనే పేరుతో ఈ పోస్టు ఉంది.

ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ

కశ్మీర్ స్వేచ్ఛ కోసం మనమంతా కలిసి కట్టుగా ఉందాం’ అని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా హుండాయ్ అధికారిక ఖాతా నుంచి కూడా ‘మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను స్మరించుకుందాం.. వారి పోరాటాన్ని కొనసాగించడానికి మద్దతు ఇద్దాం’ అని పోస్టు పెట్టారు. దీంతో ఈ ట్వీట్లపై ఇండియన్ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండియాలోని హుండాయ్ కంపెనీకి చెందిన కార్లను వాడొద్దంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈ ఆరోపణలపై ఇండియాకు చెందిన హుండాయ్ యూనిట్ (Hyundai Regrets Offense Caused to People of India) స్పందించింది. ఈ పోస్టుకు, కంపెనీకి ముడిపెట్టడం సరికాదని తెలిపింది. ‘ఇండియాలో హుండాయ్ 25 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్ కు కట్టుబడి ఉంది. ఇక్కడి బలమైన జాతీయవాద విలువలను గౌరవిస్తాం. ఈ పోస్టును హుండాయ్ కంపెనీతో లింక్ చేయడం దారుణం. బాధ్యతారహితమైన కమ్యూనికేషన్ ను మేం సహించం. భారతదేశం పట్ల మేం నిబద్ధతతో వ్యవహరిస్తాం’ అని కంపెనీ ప్రతినిధులు అధికారిక ఖాతా నుంచి పోస్టు చేశారు.

వందేండ్ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు, పార్లమెంట్‌లో ఏకి పారేసిన ప్రధాని మోదీ, లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ఉభయ సభలు

ఇదిలా ఉండగా కంపెనీ వివరణ ఇచ్చిన తరువాత పాకిస్తాన్ కు చెందిన ఆ పోస్టులు లాక్ అయ్యాయి. ఆ పోస్టులు ఇప్పుడు ట్విట్టర్లో కనిపించడం లేదు. అయితే హుండాయ్ కంపెనీ ప్రతినిధులు కేవలం వివరణ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారి కంపెనీలను ఇండియాలో రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు బీజేపీ నేత కపిల్ మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో ‘హుండాయ్ కంపెనీ చేసిన ఆ ప్రకటన భారతదేశానికే అవమానకరం. ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇస్తున్న కంపెనీ అనుమతిని ఇండియాలో రద్దు చేయాలి’ అని ట్వీట్ చేశారు.