New Delhi, May 11: భారతదేశంలో లాక్ డౌన్ (India Lockdown) అమలు చేస్తున్నా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక దేశంలో ఊహించని విధంగా పెరుగుతున్న కేసులు (India Coronavirus) చూస్తే గడిచిన 24గంటల్లో దేశంలోనే అత్యధికంగా 4,213కరోనా కేసులు (India Coronavirus) నమోదయ్యాయని,మొత్తంగా ఇప్పటివరకు 67,152కేసులు నమోదైనట్లు నేడు కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది. రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్
ఆదివారం ఒక్కరోజే 97మంది చనిపోయారని, ఇక సోమవారం నాటికి మొత్తంగా2,206 కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది. యాక్టివ్ గా ఉన్న కేసులు 44029 కాగా, రికవరీ అయిన కేసులు 20917గా ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితి చూస్తే 22,171 కరోనా కేసులతో దేశంలో మహారాష్ట్ర నెం.1స్థానంలో నిలవగా, గుజరాత్‌లో 8,194, తమిళనాడు 7,204 , ఢిల్లీ 6,923 కేసులతో ముందు వరుసలో ఉన్నాయి . అయితే,ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే మరో 7రోజుల్లో దేశంలో కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మే నెలాఖరులోగా కేసుల పెరుగుదల 2 లక్షలకు చేరుతుందని ఒక అంచనా వేస్తున్నారు.
రికవరీ రేటు మెరుగుపడుతుందని,కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపింది. ఇక కోలుకుంటున్న వారి శాతం 31.4శాతంగా ఉన్నట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా, 41,97,174 మందికి వ్యాధి సోకింది. మరియు ఈ వ్యాధి నుండి మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 2, 84,096 గా ఉంది. కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు
మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 1007కు చేరింది. గత 24 గంటల్లో 221 మందికి కరోనా సోకింది. మొత్తం 106 మంది పోలీసు అధికారులకు, 901 మంది పోలీసులకు కరోనా సోకింది. మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 1278 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 53 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 832కు పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 22, 171కు చేరింది. ధారావిలో పరిస్థితి అధికారులను కలవరపెడుతోంది. మహారాష్ట్రకు కేంద్ర బృందాలు అన్ని విధాలా సహకారం అందిస్తున్నాయి. అయినా కేసులు అదుపులోకి రావడం లేదు. మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మన ముందు పెద్ధ ఛాలెంజ్ ఉంది, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రారంభమైన ప్రధాని మోదీ 5వ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ఇక తమిళనాడులో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. సోమవారం కొత్తగా మరో 798 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 వేల మార్కును దాటి 8,002కు చేరింది. ఇక సోమవారం కొత్తగా మరో ఆరుగురు కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 53కు చేరింది. మొత్తం కేసులలో 2,051 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 5,895 మంది వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం
ఉత్తరప్రదేశ్‌లో కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఒక్కొక్కరుగా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 74 మంది పోలీసులు ఈ మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 26 కేసులు ఒక్క కాన్పూరులోనివే కావడం గమనార్హం. లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) పీవీ రామస్వామి మాట్లాడుతూ.. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 74 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని తెలిపారు. వీరిలో 26 మంది కాన్పూరుకు చెందిన వారు కాగా, 18 మంది ఫిరోజాబాద్, 11 మంది ఆగ్రా, 13 మంది వారణాసి జిల్లాలకు చెందిన వారని పేర్కొన్నారు. అలాగే, మొరాదాబాద్, బండా జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారని వివరించారు. వీరిలో ఆదివారం నాటికి 15 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు చెప్పారు. యుపీలో మొత్తం కేసులు 3467గా ఉన్నాయి. బెడ్ మీద కరోనా శవాలు, పక్కన నేల మీద రోగులు, ముంబై కెమ్ ఆస్పత్రి వీడియోని ట్విట్టర్లో షేర్ చేసిన నితేష్ రాణే, అలాంటిదేమి లేదన్న శివసేన
కేరళలో సోమవారం కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇవాళ ఒక్కరు కూడా డిశ్చార్జ్ కాలేదన్నారు. కొత్తగా కరోనా సోకిన వారిలో నలుగురు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్ర నుంచి రాగా మరో ఇద్దరు చెన్నైనుంచి రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ కేరళలో 519 మందికి కరోనా సోకింది. శ్రామిక్ స్పెషల్ రైళ్లపై రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు, ఇకపై 1700 మంది వలస కార్మికులను తీసుకెళ్లనున్న స్పెషల్ రైళ్లు, గమ్యస్థానానికి చేరిన 363 రైళ్లు
489 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 27 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం వరకు కేరళకు 1,307 మంది విదేశాల నుంచి తిరిగొచ్చారు. 650 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా..641 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంటున్నారు. 16 మందిని మాత్రం హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. కేరళకు వచ్చిన 1307 మందిలో 229 మంది గర్భిణీలు ఉన్నట్లు వైద్యాశాఖ అధికారులు వివరించారు. తెరుచుకున్న ఐటీ కార్యాలయాలు, హైటెక్ సిటీ వైపు క్రమంగా పెరుగుతున్న రద్దీ, మెట్రో,ఎంఎంటీసీ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు
ఢిల్లీలో 6923కు కరోనా పాజిటివ్ కేసులు నవెూదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్ కేసులు నవెూదవగా, 215 మంది మృతిచెందారు.
గడిచిన 48 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 13శాతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్ డౌన్ సడలింపులు చేసి ప్రభుత్వం నిదానంగా జన జీవనం కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటుంటే ఇక తాజాగా గడిచిన రెండు రోజుల్లో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ముంబై,అహ్మదాబాద్,చెన్నై,థానే,ఇండోర్ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు తెలుస్తుంది . గడిచిన 48గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో 39శాతం ఈ ఐదు జిల్లాల్లోనే నమోదైనట్లు తెలుస్తుంది . లాక్ డౌన్ సడలింపులతో దేశంలో ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి.