Covid Second Wave: సెకండ్ వేవ్‌తో దేశం మొత్తం ప్రమాదంలో పడింది, ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం, దేశంలో తాజాగా 53,480 మందికి కరోనా, జోధ్‌పూర్ ఐఐటీలో 25 మంది విద్యార్థులకు కోవిడ్
Coronavirus (Photo-PTI)

New Delhi, Mar 31: దేశంలో గ‌త 24 గంటల్లో 53,480 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 41,280 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335కు (India Coronavirus) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 354 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,468కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,34,301 మంది కోలుకున్నారు. 5,52,566 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి వ్యాక్సిన్లు వేశారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ ఐఐటీలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తాజాగా తేలింది. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జోధ్‌పూర్ ఐఐటీలో శానిటైజేషన్ చేయించారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు పెరిగింది. కరోనాతో 271 మంది మరణించారు. ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా అధికంగా ప్రబలుతున్న 10 జిల్లాల్లో 8 జిల్లాలు మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోనూ గత 72 గంటల్లో 664 కరోనా కేసులు వెలుగుచూశాయి.

ఔరంగాబాద్‌లో ఈ నెల 31వ తేదీ నుంచి అమ‌లు కావాల్సిన లాక్‌డౌన్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ జిల్లా క‌లెక్ట‌ర్ సునీల్ చౌహాన్ స్ప‌ష్టం చేశారు. నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌లు వ్య‌తిరేకించ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్ ప్రదేశాలను గుర్తించిన అధికారులు, మరోసారి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో జీహెచ్ఎంసీ, పెరుగుతున్న కేసులతో వణుకుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత మరింత విషమంగా మారిందని, ప్రస్తుతం దేశం మొత్తం ప్రమాదంలో పడిందనీ, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన మొదటి 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలో, ఒకటి ఢిల్లీలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకరంగా తయారైందని తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, నీతి ఆయోగ్‌(ఆరోగ్య)సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

దేశంలో యాక్టివ్‌ కేసులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించిన 10 జిల్లాల్లో పుణేలో 59,475 కేసులు, ముంబైలో 46,248, నాగ్‌పూర్‌లో 45,322, థానేలో 35,264, నాశిక్‌లో 26,553, ఔరంగాబాద్‌లో 21,282, బెంగళూరు అర్బన్‌లో 16,259, నాందేడ్‌లో 15,171, ఢిల్లీలో 8,032, అహ్మద్‌నగర్‌లో 7,952 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపారు.

గడిచిన కొన్ని వారాల్లోనే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. ఏ ఒక్క రాష్ట్రం, ప్రాంతం, జిల్లా ఇందుకు మినహాయింపు కాదు. ఆస్పత్రుల్లో ఐసీయూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసులు వేగంగా పెరిగిన పక్షంలో ఆరోగ్య వ్యవస్థ స్తంభించిపోతుందిని చెప్పారు. జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేట్‌ 5.65% ఉండగా మహారాష్ట్రలో గత వారం ఇది 23%గా రికార్డయినట్లు తెలిపారు. ఆ తర్వాత పంజాబ్‌లో పాజిటివిటీ రేట్‌ 8.82%, ఛత్తీస్‌గఢ్‌లో 8.24%, మధ్యప్రదేశ్‌లో 7.82%, ఢిల్లీలో 2.04% ఉందన్నారు. దేశంలో యూకే వేరియంట్‌ కేసులు 807, దక్షిణాఫ్రికా వేరియంట్‌ కేసులు 47, బ్రెజిల్‌ వేరియంట్‌ కేసు ఒకటి బయటపడింది.

సెకండ్ వేవ్‌లో యూత్‌ని టార్గెట్ చేసిన కరోనా, 20-39 సంవత్సరాల వయస్సు వారిపై అధికంగా కోవిడ్ వైరస్ ప్రభావం, అజాగ్రత్తగా ఉంటే మొదటి వేవ్ కన్నా ఎక్కువ మరణాలు సంభవిస్తాయంటున్న బెంగుళూరు వైద్యులు

మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లోని కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న 47 జిల్లాల అధికారులకు శనివారం రాసిన లేఖలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చామని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఒక్కో పాజిటివ్‌ కేసుకు 25 నుంచి 30 కాంట్రాక్టులను గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచాలని కోరామన్నారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిని కూడా విస్తరించాలని తెలిపినట్లు వివరించారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి 6.11 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు తెలిపారు.

తెలంగాణలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అత్యధికంగా 48.39% మందికి, ఆ తర్వాత ఢిల్లీలో 43.11% మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా పంపిణీ జరుగుతుందన్నారు. కో–విన్, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చని, లేదంటే ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వ్యాక్సిన్‌ కేంద్రంలోనే పేర్ల రిజిస్ట్రేషన్‌ ఉంటుందని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి

ఇక ఆస్పత్రిలో ఒకే పడకపై ఇద్దరు కోవిడ్‌ రోగులను ఉంచిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని నాగ్‌పూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో తీసిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్‌ ఉన్న పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం కోసం భారీగా డబ్బును వసూలు చేస్తాయని భయపడుతున్న వారంతా ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు.

అంతేగాక బాగా సీరియస్‌ పరిస్థితిలో ఉన్న రోగులను డాక్టర్లు వార్డుకు పంపిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ అవినాశ్‌ గవాండే చెప్పారు. అయితే ఫొటోలు తీసిన నాటికి, ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. వర్క్‌లోడ్‌ ఒకప్పుడు ఎక్కువగా ఉండేదని ఇప్పుడు తక్కువే ఉందన్నారు. ప్రస్తుతం బెడ్‌కు ఒక రోగి మాత్రమే ఉన్నారని చెప్పారు.