Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, October 6: దేశంలో గడచిన 24 గంటలలో 10,89,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 61,267 పాజిటివ్ కేసులు (India Reports 61,267 COVID-19 Cases), 884 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,083గా ఉంది. యాక్టివ్ కేసులు 9,19,023గా ఉండగా (Active Cases Drops to 9.19 Lakh) కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 56,62,491కు చేరింది.

కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1,03,569 మంది మృతి చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 84.70 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 13.75గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,10,71,797 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మహారాష్ట్రలో ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 10,244 కరోనా కేసులు నమోదు కాగా, 263 మంది మరణించారు. దీంతో ఆ రాష్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,53,653కు, మరణాల సంఖ్య 38,347కు పెరిగింది. గత 24 గంటల్లో 12,982 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 11,62,585 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 2,52,277 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

కరోనాపై మరో షాకింగ్ న్యూస్, ప్రతి పదిమందిలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు, సంచలన విషయాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉందని హెచ్చరిక

త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,395 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,391కి చేరింది. అందులో సోమ‌వారం వైర‌స్ బారి నుంచి కోలుకున్న 5,572 మందితో క‌లిపి మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 5,69,664కు పెరిగింది. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య‌లో పెద్ద‌గా హెచ్చుత‌గ్గులు లేకుండా 45,881గా ఉన్న‌ది. ఇక త‌మిళ‌నాడులో కరోనా మ‌ర‌ణాల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతున్న‌ది. సోమ‌వారం కొత్త‌గా 62 మంది క‌రోనా బాధితులు మృతిచెందడంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 9,846కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమానాలు, హెపటైటిస్ సి వైరస్‌ను కనిపెట్టినందుకు అవార్డులు,ఈ వ్యాధి ద్వారా కాలేయ క్యాన్సర్‌ సోకే ప్రమాదం

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు కంటి సమస్యల బారిన పడే ప్రమాదముందని నేత్ర వైద్యులు చెబుతున్నారు. వారిలో రెటీనా సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, కంటి చూపు మందగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా రెటినోపతి సమస్య మరింత తీవ్రంగా ఉంటుందన్నారు.కరోనా వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులలో ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను తగ్గించేందుకు స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారని, ఇందువల్ల నేత్ర సమస్యలు పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

స్టెరాయిడ్‌ చికిత్స కారణంగా వచ్చే రెటినోపతి సమస్య కొవిడ్‌ వ్యాధి తగ్గిన 2 నుంచి 4 వారాల లోపల బయటపడుతుందని..కన్ను ఎర్రబడకుండా, నొప్పి లేకుండానే కంటి చూపు మసక బారడం దీని ప్రధాన లక్షణమని వైద్యులు పేర్కొన్నారు. కొవిడ్‌ నుంచి కొలుకున్న తర్వాత కంటి చూపు మందగించినట్లు ఏమాత్రం అనిపించినా.. వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలని నేత్ర వైద్యులు చెబుతున్నారు.