Coronavirus in India: దేశంలో కనిష్ఠస్థాయికి పడిపోయిన కేసులు, తాజాగా 1,00,636 మందికి కోవిడ్, ప్రస్తుతం 14,01,609 యాక్టివ్ కేసులు, హర్యానాలో జూన్ 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, డేరా బాబాకు కరోనా పాజిటివ్
Coronavirus outbreak | (Photo Credits: IANS)

New Delhi, June 7: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు (New COVID-19 Cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు (Coronavirus in India) చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,49,186 మంది బాధితులు మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 2427 మంది మృతిచెందారని, కొత్తగా 1,74,399 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ (Health And Family Welfare Ministry) ప్రకటించింది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించారు. ఇక దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి మొత్తం 36,63,34,111 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,87,589 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.

కరోనావైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పొడగించింది. సోమవారంతో లాక్‌డౌన్‌ ముగియనుండగా.. మనోహర్ లాల్ ఖట్టర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం జూన్ 14న ఉదయం 5 గంటల వరకు పొడగించింది. ఈ సందర్భంగా కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాలు, మాల్స్‌, రెస్టారెంట్లు, బార్లు, మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దుకాణాలను ఢిల్లీ తరహాలో సరి-బేసి విధానంలో తెరిచేందుకు అవకాశమిచ్చింది.

72 లక్షల కుటుంబాలకు తరపున చేతులెక్కి మొక్కుతున్నా, డోర్ స్టెప్ ఆఫ్ రేష‌న్ స్కీమ్‌ను ఆపకండి, కేంద్రమే రేషన్ మాఫియా తరపున నిలబడితే పేదలకు ఎవరు అండగా ఉంటారని సూటిగా ప్రశ్నించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మాల్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, బార్‌లు 50శాతం సీటింగ్‌తో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా సామాజిక దూరం, శానిటైజేషన్‌, కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అలాగే కార్పొరేట్‌ కార్యాలయాలు 50 శాతంతో నిర్వహించుకునేందుకు.. వివాహాలు, అంత్యక్రియల్లో 21 మంది పాల్గొనేందుకు అనుమతి ఇవ్వగా.. పెళ్లి అనంతర బరాత్‌పై నిషేధం విధించింది.

కొత్త కొత్తగా బెంగాల్ రాజకీయాలు, బీజేపీ నేత సువేందు ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, సువేందు ముఖ్య అనుచరుడు రేఖాల్​ బెరా కూడా అరెస్ట్

డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినుల‌పై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతనికి, మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. జైలు శిక్ష పడిన నాటి నుంచి ఆయన రోహ్తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి ఉందని చెప్పడంతో రోహ్తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్‌)లో పరీక్షలు చేయించారు.

అనంతరం అక్కడి నుంచి మెదాంత ఆస్పత్రికు కొవిడ్‌ పరీక్షలకు తరలించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని అధికారులు పేర్కొన్నారు. గత నెలలోనూ డేరా బాబా లోబీపీతో పీజీఎంఐఎస్‌ ఆసుపత్రిలో చేరగా.. కొవిడ్‌ పరీక్ష చేసుకునేందుకు నిరాకరించారు. ఇటీవల తాను వ్యవసాయం చేసుకుంటానంటూ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను చేసిన నేరాలు క్షమించరాని పెద్ద నేరాలేమీ కాదని.. జైలులో తన సత్‌ప్రవర్తన చూసి పెరోల్‌ ఇవ్వాలని వేడుకున్నారు.