Mumbai, April 10: మరికొద్ది రోజుల్లో లాక్ డౌన్ (Lockdown) ముగియనున్న నేపథ్యంలొ రైళ్లు తిరుగుతాయని సోషల్ మీడియాలో (Social Media) వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బుకింగ్ కార్యకలాపాలు పూర్తయ్యాయని ఏప్రిల్ 15 నుంచి రైళ్లును నడిపేందుకు ఇండియన్ రైల్వే (Indian Railways) కసరత్తు చేస్తోందని వార్తలు సోషల్ మీడియాలో గత కొద్ది రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫేక్ వార్తలపై (Fake News) రైల్వే శాఖ స్పందించింది.
భారత ప్రజల మేలు మరచిపోలేము, ధన్యవాదాలు ప్రధాని మోడీజీ
రైలు ప్రయాణాలపై గడిచిన రెండు రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయియని అటువంటి ప్రచారాలను నమ్మొద్దని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నెల 14వ తేదీన లాక్‌డౌన్ ముగుస్తుండటంతో 15వ తేదీ నుంచి రైలు ప్రయాణాలకు సంబంధించి రిజర్వేషన్లను రైల్వేశాఖ ప్రారంభించిందంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాలపై రైల్వేశాఖ స్పందించింది.
Here's Ministry of Railways Tweet
PRESS RELEASE ON MISLEADING MEDIA REPORTS #IndiaFightsCoronahttps://t.co/dAtGce1myu pic.twitter.com/snXgAp91MW
— Ministry of Railways (@RailMinIndia) April 10, 2020
రైలు ప్రయాణ ప్రారంభాలు, కోవిడ్-19 (COVID-19) నేపథ్యంలో ప్రయాణికులకు మార్గదర్శకాలు, రిజర్వేషన్ల ప్రారంభ తేదీలు అంటూ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అసత్యాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటువంటి వార్తలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయన్నారు.
కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు
ఏదైనా ప్రసారం చేసేప్పుడు సంబంధిత వర్గాల నుంచి అధికారికంగా తెలుసుకొని ప్రసారం చేయాలని మీడియాని కోరింది. రైలు ప్రయాణాలపై ఏ నిర్ణయం తీసుకున్నా తక్షణమే రైల్వేశాఖ తెలియజేయనున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది.