Patna, July 14: గత కొద్ది రోజులుగా కరోనావైరస్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం (Bihar Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి 31 వరకు తిరిగి పూర్తి స్థాయి లాక్‌డౌన్ (Lockdown) అమలు చేయాలని నిర్ణయించింది. అత్యవసర సేవలపై మినహా మిగిలిన అన్ని పనులపై కఠిన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం (జులై 14) ఉదయం రాష్ట్రంలో కరోనా కేసులు (Coronavirus Cases), వైరస్ వ్యాప్తి తదితర స్థితిగతులపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పాట్నా బీజేపీ ఆఫీసులో 24 మందికి కరోనా పాజిటివ్, మరో చోట అంత్యక్రియలకు హాజరైన 20 మందికి కోవిడ్-19 పాజిటివ్
వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఈ లాక్‌డౌన్ కాలంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కఠినంగా ఆంక్షలు పాటించాలని, ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన కోరారు. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేస్తామన్నారు.
Check Full List of Bihar Lockdown Guidelines :
Bihar govt issues guidelines for lockdown from 16 to 31 July: Farming & construction-related activities allowed. Places of worship to remain closed. Commercial, private and govt establishments to remain closed apart from mentioned exceptions. Essential services allowed. #COVID19 https://t.co/wUGEzu1FG8 pic.twitter.com/p6lIYplqmD
— ANI (@ANI) July 14, 2020
బీహార్‌లో ఇప్పటి వరకు 17,959 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 12,317 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 5,482 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే లాక్‌డౌన్‌లో సడలింపులు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్, రూరల్ వర్క్స్ శాఖ మంత్రి శైలేశ్ కుమార్ ఈ మహమ్మారి బారినపడ్డారు. పాట్నాలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న 100 మందికి కరోనా టెస్టు చేయగా.. బీహార్ బీజేపీ జనరల్ సెక్రెటరీ దేవేశ్ కుమార్, ఎమ్మెల్సీ రాధామోహన్ శర్మ సహా 75 మంది నేతలకు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. దేశంలో 24 గంటల్లో 28,498 కొత్త కేసులు, 540 మరణాలు, 9,07,645కు చేరుకున్న కోవిడ్-19 కేసులు, కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,71,460 మంది
ఇక కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి సాయంత్రం నుంచి ఈనెల 22 వరకు రాజధాని బెంగళూరుతోపాటు దానిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలు, కిరాణా దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కర్ణాటకలో నిన్న ఒక్క రోజే 2,738 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 41,581కి పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 757 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 25 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇక, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడులోనూ కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న 4,328 కేసులు నమోదు కాగా, 66 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 2,032కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 1,42,798 కేసులు నమోదు కాగా, వీటిలో 90 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.