రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది.మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఏపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 61.43శాతం, అత్యల్పంగా విశాఖపట్నంలో 47.66శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.96శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 29.47 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 62.44 శాతం, భువనగిరిలో 62.05 శాతం, చేవెళ్లలో 42.35 శాతం, హైదరాబాద్‌లో 29.47 శాతం, కరీంనగర్‌లో 58.24 శాతం, ఖమ్మంలో 63.67 శాతం, మహబూబాబాద్‌లో 61.40 శాతం, మహబూబ్‌నగర్‌లో 58.92 శాతం, మల్కాజ్‌గిరిలో 37.69 శాతం, మెదక్‌లో 60.94 శాతం, నాగర్‌కర్నూల్‌లో 57.17 శాతం, నల్లగొండలో 59.91 శాతం, నిజామాబాద్‌లో 58.70 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, సికింద్రాబాద్‌లో 35.48 శాతం, వరంగల్‌లో 54.17 శాతం, జహీరాబాద్‌లో 63.96 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు, ఓటు వేయమని ఇంటింటికి వెళ్ళి చెబుతున్న స్థానికులు, వీడియోఇదిగో..
గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓటర్లు పోలింగ్ బూత్ లకు భారీగా తరలి రావడం చర్చనీయాంశంగా మారింది.గ్రామాల నుంచి పట్టణాల వరకు పోలింగ్ బూత్ ల వద్ద ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా, చాలామంది యువత తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్న సమయానికి వేల సంఖ్యలో ఓటర్లతో చాలాచోట్ల పోలింగ్ బూత్ లు కిటకిటలాడాయి. తెనాలి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినా ఓటర్లు లెక్కచేయని పరిస్థితి కనిపిస్తోంది.