New Delhi, June 1: దేశంలోని మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర సిలిండర్ ధరలు (LPG Cylinder Price Hike) పెరిగాయి. గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్న సిలిండర్ ధరలు ఈసారి పెరిగాయి. మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ 37 చొప్పున పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధర (LPG Price in India) పెరగడంతో సిలిండర ధరలను స్వల్పంగా పెంచామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, దేశ వ్యాప్తంగా పట్టాలెక్కిన 200 రైళ్లు, తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు, విజయవాడ మీదుగా 14 రైళ్లు, పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే శాఖ
అంతర్జాతీయ ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అంశాల ఆధారంగా ఎల్‌పీజీ ధరలను ప్రతి నెల ఆరంభంలో సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ 636కు పెరిగింది. ఇక ఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ 593కు చేరగా, కోల్‌కతాలో రూ 616, ముంబైలో రూ 590, చెన్నైలో రూ 606కు ఎగబాకింది.పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ
మెట్రో ప్రధాన నగరాలైన కోల్‌కతాలో రూ.31.50 (రూ.616), ముంబైలో రూ.11.50 (రూ.590.50), చెన్నైలో రూ.37 (రూ.606.50) పెరిగాయి. గృవాసరాల కోసం ఏడాది కాలంలో వినియోగించే 12 సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నది. ఈ కోటాకు మించి వినియోగించేవారు పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గత మేలో రూ.744 ఉన్న రేటును రూ.581.50కి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.593కు చేరింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులపై పెంచిన రేటు ప్రభావం ఉండదని తెలిపాయి. జూన్ 30 వరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత సిలిండర్లు అందనున్నాయి.