Hyd, Oct 24: బీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.
ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుంది...సియోల్ పర్యటన తరువాత పునరావాసం తరువాత రీహాబిలిటేషన్ అవుతున్న వారి పట్ల ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ది అని తెలిపారు.
అవకాశవాద రాజకీయాలు చేస్తూ ధర్నాలు , నిరసనలు పేరు మీద ముసలి కన్నీరు కార్చడం కాదు... నిజంగా తెలంగాణ అభివృద్ది కోసం పాటు పడాలనుకుంటే.. తెలంగాణకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని ఎద్దేవా చేశారు. దీపావళి ముందే పొలిటికల్ బాంబ్...ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో కీలక నేతలపై చర్యలు, సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పొంగులేటి
Here's Video:
పొన్నం ప్రభాకర్,హైదరాబాద్ ఇంచార్జి మంత్రి
బీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుంది..
బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..
మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పండి.
ప్రభుత్వం… pic.twitter.com/sYKxTT4sU8
— Telangana Awaaz (@telanganaawaaz) October 23, 2024
మూసి విషయంలో మీరు సహకరించదలుచుకుంటే మూసి సమస్యలు పేదలకు అన్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వం వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది.. బీజేపీ నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు మంత్రి పొన్నం.