Night Curfew in Delhi: వణికిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్, నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం, గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 3548 కరోనా కేసులు నమోదు
Delhi Police | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, April 6: దేశ రాజధానిలో కరోనావైరస్ చేయి దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి ఇవాళ్టి నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ (Night Curfew in Delhi) విధిస్తున్నట్టు ప్రకటించింది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు (Night Curfew in Delhi From 10 PM to 5 Am Till April 30) అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుందని తెలిపింది. అనుమతులు లేకుండా బయటకు వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాజా ప్రకటనలో తెలిపింది.

అయితే, అత్యవసరాలు, వాక్సినేషన్‌ కోసం ప్రయాణాలు చేసే వారికి ఈ- పాసులు జారీ చేస్తామని, కర్ఫ్యూ సమయంలో వారికి మాత్రం అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా, జర్నలిస్టులు, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీలో మూడు దాటి 4వ దశలోకి చేరిన కరోనా, మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండని వేడుకుంటున్న సీఎం కేజ్రీవాల్, లాక్‌డౌన్‌ లేదు, జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచన

గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 3548 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసుల్లో ఆరు శాతం పెరుగుదల కనిపించింది. సోమవారం ఒక్క రోజే 15 మంది చనిపోయారు. కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కట్టడి చర్యలకు కేజ్రీవాల్ సర్కార్ దిగింది. రాష్ట్రంలో ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించేది లేదని, అయితే రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మనుషుల నుంచి జంతువులకు కరోనా, పెంపుడు జంతువుల‌కు దూరంగా ఉండ‌టం మంచిదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, ఇత‌ర జంతువుల‌పై వైర‌స్ ప్ర‌భావం గురించి అధ్యయనం

ఢిల్లీలో ఫోర్త్ వేవ్ కొన‌సాగుతోంద‌ని, లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన త‌ర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.